pratani ramakrishna goud Archives | Cine Chitram

చిత్రపరిశ్రమ అతలాకుతల‌మవుతున్నప్పుడు వివాదాలు అవసరమా – ప్రతాని రామకృష్ణగౌడ్‌
తాజాగా నోట్ల రద్దు అంశంతో చిత్రపరిశ్రమ కుదేలై సినిమా షూటింగ్‌లు, రిలీజ్‌లు వాయిదా పడుతున్న దిక్కుతోచని ఈ స్థితిలో వివాదాలు అవసరమా? వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో కెక్కాల‌నే దురాలోచన సరైనదేనా? తెలంగాణ చాంబర్‌ తనదేనంటూ, మరికొన్ని ఫేక్‌ సంస్థలు ఉన్నాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మురళీమోహన్‌రావు దాన్ని నిరూపించాడానికి సిద్ధమేనా? అని తెంగాణ ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణగౌడ్‌ ఓ ప్రకటన ద్వారా సూటిగా ప్రశ్నించారు, అవసరమైతే బహిరంగ చర్చకు సిద్ధమేనా అని సవాల్‌ విసిరారు.

తెలంగాణలోని కొన్ని సంస్థల్లో భోగస్‌ సభ్యులు ఉన్నారంటూ ఆయన విమర్శించడం సరైనది కాదు. నిర్మాతగా ఏ సినిమాలు నిర్మించని మురళీమోహన్‌రావుకు నిర్మాత, టెక్నీషియన్‌, కార్మికుల బాధలు ఎలా తెలుస్తాయి. మంత్రుల‌ దగ్గర వారి పి.ఏల‌ వద్ద భజన చేస్తూ పైరవీలు చేయడం తప్ప పదవులు పొందుతూ స్వప్రయోజనాల‌కు ప్రాధాన్యత ఇచ్చే ఈయనకి మాట్లాడే అర్హత ఎక్కడిది. సిల్వ‌ర్‌ జూబ్లీ సందర్భంగా నిన్న ఆయన ఒక ప్రకటన విడుదల‌ చేస్తూ పలు వివాదాస్పద వ్యాఖ్య‌లు చేశారు.

దానికి సమాధానంగా మేము తెలంగాణ ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్రకటనలో ఆయనకు వివరణ ఇవ్వదలిచాము.

నా విషయానికొస్తే 1990లో నిర్మాతగా నా తొలి సినిమాకు ఇప్పటి మన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు (కేసిఆర్‌)గారు క్లాప్‌ కొట్టారు. అలాగే మరో నాలుగు సినిమాల‌కు ఆయనే క్లాప్‌ ఇచ్చారు. తెలంగాణ నిర్మాతల్లో 32 సినిమాల‌ నిర్మాణంతో అత్యధిక చిత్రాలు నిర్మించిన వారిలో మొదటి వరుసలో ఉన్నాను. 100 సినిమాల‌కు పైగా డిస్ట్రిబ్యూషన్‌ చేశాను. 5 సినిమాల‌కు దర్శకత్వం వహించగా, 20 సినిమాలో నటుడిగా వివిధ పాత్రల‌ను పోషించాను. గత 15 సంవత్సరాల‌ నుండి తెలుగు ఫిలిం చాంబర్‌లో ఏదో ఒక పదవిలో కొనసాగుతూనే ఉన్నాను. ప్రొడ్యూసర్‌ సెక్టార్‌ ఛైర్మన్‌గా వైస్‌ ఛైర్మన్‌గా, సెక్రటరీగా ఈ.సి. మెంబర్‌గా పదవవులు నిర్వహించాను. ప్రస్తుతం తెలుగు ఫిలింప్రొడ్యూసర్‌ సెక్టార్‌ ఛైర్మన్‌గా, ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌లో ఈ.సి మెంబర్‌గా ఉన్నాను. తెలుగు ఫిలిం చాంబర్‌కు జరిగిన ఎన్నికలో అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలుపొందాను. అదే ఎన్నికల్లో పోటీ చేసిన మురళీమోహన్‌రావు ఓడిపోయారు. నిర్మాతలు పడుతున్న బాధలు గురించి ఒక్క విషయం కూడా పట్టించుకోని ఆయన ఓడిపోయారు. తెలంగాణలో ధియేటర్‌పై కొద్ది మంది వ్యక్తుల‌ గుత్తాధిపత్యం సాగుతున్న పరిస్థితుల్లో చిన్న సినిమాలు రిలీజ్‌ కాక ధియేటర్లు దొరక్క నిర్మాతలు ఎంతో ఇబ్బంది పడుతుంటే వారి విషయాల‌ గురించి మాట్లాడని ఈ పెద్ద మనిషి ఇప్పుడు ఇలాంటి పనికిరాని విషయాలు మాట్లాడుతున్నారు.

ఈ రోజు చిన్నా` పెద్ద నిర్మాతలు డిజిటల్‌ దోపిడికి గురవుతున్నారు. ఎలా అంటే పక్క రాష్ట్రాల‌యిన తమిళనాడు, కర్ణాటక (బెంగుళూరు)లో ప్రొసెసింగ్‌ ఛార్జీలు వారానికి 2500 నుండి 3000 లోపు ఉండగా, అదే ప్రొసెసింగ్‌ ఛార్జీలు వారానికి మన తెలుగు రాష్ట్రాల్లో 10,800 నుండి 13,000రూపాయు వరకు తీసుకుంటూ నిర్మాతల‌ను గుల్ల‌ చేస్తున్న వారికి, మధ్య దళారుల‌కు` ఈ మురళీమోహన్‌రావు లాంటి వ్యక్తుల‌ వారి బృందం సపోర్ట్‌ చేస్తున్నారు. పలు రకాల పైర‌వీలు చేసుకుంటూ వీరు పదవులు పొందుతూ లాభాలు గడిస్తున్నారు. ఈ విషయంలో అధికారుల‌ దృష్టికి వెళ్ళినా వారిని కూడా మేనేజ్‌ చేస్తూ నేర్పరితనాన్ని ప్రదర్శిస్తున్నారు.

32 సినిమాలు చేసి ఇండస్ట్రీలో నిర్మాతగా, దర్శకుడిగా, డిస్ట్రిబ్యూటర్‌గా, నటునిగా పనిచేస్తూ నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని నిర్మాతల‌- సాంకేతిక నిపుణుల‌తో పాటు కార్మిక వర్గానికి నేను పలు రకాల‌ తోడ్పాటును అందిస్తున్నాను. నిర్మాతల‌ శ్రేయస్సు కోసం వారికి ధియేటర్లు అందుబాటులోకి రావాల‌నే డిమాండ్‌తో ఆమరణ నిరాహార దీక్ష చేశాను. వారం రోజులు చేసిన తర్వాత మంత్రివర్యులు మహేంద్రరెడ్డి ఎం.పిు వేణుగోపాలాచారి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బూర నర్శిగౌడ్‌లాంటి పెద్దలు వచ్చి నిమ్మరసం ఇచ్చి ప్రభుత్వంతో మాట్లాడి ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆనాడు సినిమాటోగ్రఫి మంత్రిగా శ్రీనివాస్‌ యాదవ్‌గారు పదవీ బాద్యతలు చేపట్టలేదు. ఇప్పుడు ఆయన ఈ సమస్యపై అధ్యయనం చేస్తున్నారు.

ఇక తెలంగాణ సినిమా ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ 24 క్రాఫ్ట్‌ల‌కు చెందిన 5000 మంది సభ్యుల‌తో ఉంది. అది మా తెలంగాణ ఫిలిం చాంబర్‌లో అప్లియేషన్‌ తీసుకుని పనిచేస్తుంది. మా తెలంగాణ ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌కు తెంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల‌ గుర్తింపు ఉంది. ఇందులో సభ్యులుగా నిర్మాతలు 1000 మంది ఉన్నారు. ఆర్టిస్టులుగా 250 మంది ఉన్నారు. డైరెక్టర్స్‌, కెమెరామెన్స్‌ 100 మంది ఉన్నారు. ఇతర టెక్నీషియన్స్‌ 300 మంది ఉన్నారు. దాదాపు వీరందరికి హెల్త్‌ కార్డును ఇప్పించేందుకు అర్హత కలిగిన పేద టెక్నీషియన్లందరికి ప్రభుత్వం తరపున నిర్మించబోయే చిత్రపురి కాల‌నీలో ప్లాట్లు ఇవ్వాల‌ని ప్రభుత్వాన్ని కోరుతున్నాం… ఆ దిశగా పనిచేస్తున్నాం. పరిశ్రమలోని వారెవ్వరూ పట్టించుకోని పరిస్థితుల్లో దాదాపు 15 మంది నిర్మాతల‌కు షూటింగ్‌ సందర్భాల్లో ఆర్టిస్టుల‌తో ఏర్పడిన వివాదాల‌ను మా చాంబర్‌ సున్నితంగా పరిష్కరించగలిగింది. ఈ విషయాల‌న్నింటిని నిరూపించడానికి మా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ విషయంపై మురళీమోహన్‌రావు సిద్ధపడితే బహిరంగ చర్చకు తాము రెడీగా ఉన్నాము.

అదేవిధంగా ప‌లు సేవా కార్యక్రమాల‌తో పాటు తెలంగాణలోని ఓ మారుమూల‌ పల్లెలో పుట్టిన ‘రేష్మి ఠాగూర్‌’ అనే యువతి ‘మిస్‌ ఏసియా’ పోటీకు వెళ్తుందని తెలిసి మా తెలంగాణ ఫిలిం చాంబర్‌ సభ్యులైన డా॥వెంకట్‌ నేతృత్వంలో ఐదు ల‌క్షల‌ రూపాయల‌ నగదు, రానుపోను ఎయిర్‌ టిక్కెట్లను నేను ఇవ్వడం జరిగింది. ‘మిస్‌ ఏసియా’గా గెలిచి రావడంతో అభినందించాము. అలాగే చాలామంది చిన్న నిర్మాతలు సినిమా రిలీజ్‌ సమయంలో ఇబ్బంది పడుతున్నపుడు సొంత డబ్బు ఖర్చు చేసుకుని వారికి సహకరించడం జరిగింది. ఇలా ఎంతో యాక్టివ్‌గా పనిచేస్తున్న మాలాంటి వారిని విమర్శించేందుకు సిద్ధపడిన మురళీమోహన్‌రావు లాంటి వ్యక్తి చేసిన సహాయాలు ఎలాంటివో బహిరంగంగా చెప్పాల‌ని మేము డిమాండ్‌ చేస్తున్నాం. మురళీమోహన్‌రావుగారు బహిరంగ చర్చకు సిద్ధపడాల‌ని, ప్రొడ్యూసరే కాని మురళీమోహన్‌రావు ప్రొడ్యూసర్‌ బాధలు గురించి ఎలా మాట్లాడతారని ప్రశ్నిస్తున్నాం. అసలే అనుకోకుండా నోట్ల రద్దుతో చిత్ర పరిశ్రమ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఈ దురదృష్టకర పరిస్థితుల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకి రావాల‌నుకోవడం మూర్ఖత్వంగా భావిస్తూ ఆయన వైఖరి శోచనీయమని నిరసిస్తూ బహిరంగ చర్చకు రావాల‌ని సవాల్‌ విసురుతున్నాం.

The post చిత్రపరిశ్రమ అతలాకుతల‌మవుతున్నప్పుడు వివాదాలు అవసరమా – ప్రతాని రామకృష్ణగౌడ్‌ appeared first on Cine Chitram.