జగపతిబాబు టైటిల్ పాత్రలో వారాహి చలనచిత్రం ప్రొడక్షన్ నెం.11 “పటేల్” ప్రారంభం!!

జగపతిబాబు టైటిల్ పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం “పటేల్”. “ఎస్.ఐ.ఆర్” అనేది ట్యాగ్ లైన్. వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ద్వారా ప్రముఖ యాడ్ ఫిలిమ్ మేకర్ వాసు పరిమి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్ర ప్రారంభోత్సవం నేడు (మార్చి 30) వారాహి చలనచిత్రం ఆఫీసులో ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ప్రారంభోత్సవం సందర్బంగా సినిమా టీజర్ ను కూడా విడుదల చేయడం విశేషం. 
దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి సంగీత దర్శకులు ఎం.ఎం.కీరవాణి క్లాప్ కొట్టగా.. దర్శకధీరుడు రాజమౌళి గౌరవదర్శకత్వం వహించారు. మరో సంగీత దర్శకులు కళ్యాణ్ కోడూరి కెమెరా స్వీచ్చాన్ చేశారు. 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సాయి కొర్రపాటి మాట్లాడుతూ.. “తెలుగు చిత్రసీమలో ఉన్న అద్భుతమైన నటుల్లో జగపతిబాబు ఒకరు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో జగపతిబాబు స్టైలిష్ గా కనిపించనున్నారు. టీజర్ ను కూడా నేడు విడుదల చేశాం. ఈ టీజర్ ను మా డైరెక్టర్ వాసు పరిమి రెండు రోజుల్లో తెరకెక్కించడం మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది” అన్నారు. 
ఈ చిత్రానికి రచయిత: సునీల్, లైన్ ప్రొడ్యూసర్: కార్తికేయ, సంగీతం: డిజే వసంత్, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, సమర్పణ: సాయిశివాని, నిర్మాత: రజిని కొర్రపాటి, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: వాసు పరిమి! 

Video

Stills

About CineChitram

Check Also

మెగాబ్రదర్‌ నాగబాబుచే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘కళ్యాణ్‌ ఫ్యాన్‌ ఆఫ్‌ పవన్‌’

శ్రీ లక్ష్మీలోహిత క్రియేషన్స్‌ అండ్‌ శ్రీ శరణ్య సినీ చిత్ర కంబైన్స్‌ సంయుక్తంగా సత్య డైరెక్షన్‌లో నిర్మాత టి. రామకృష్ణ …

Jagapathi Babu, Vaaraahi Chalana Chitram Production No 11 Patel S.I.R Opening!

Versatile actor Jagapathi Babu’s intense action thriller movie titled Patel S.I.R to be produced by Sai Korrapati of Vaaraahi Chalana Chitram is opened today with Muhurtham Pooja held at Vaaraahi Chalana Chitram office attended by important guests like Keeravani, Rajamouli and Kalyan Koduri. Director for the film is Vasu Parimi.
“Jagapathi Babu is one of the finest actors in present cinema industry. Vaaraahi Chalana Chitram is glad to begin its Production No 11 with Jagapathi Babu for an intense action thriller in Vasu Parimi direction. Jagapathi Babu will be seen in a new look in this intensely gripping script and we are excited to begin the shooting.
While musical legend MM Keeravani sounded the clap board, Darshaka Dheera Rajamouli directed the first honorary shot and Kalyan Koduri switched on the camera, ,’ informed producers.
Presents: Sai Shivani
A Sai Korrapati Production
Line Producer: Karthikeya
DOP: Syam K Naidu
Writer: Sunil
Music: DJ Vasanth
Producer: Rajini Korrapati
Screenplay, Direction: Vasu Parimi

Video

Stills

About CineChitram

Check Also

Aaradugula Bullet – Gopichand, B Gopal Film Title, First Look Poster

Action hero Gopichand’s sensational combination with mass director B Gopal is titled Aaradugula Bullet. This …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading