వి.ఆర్ చలనచిత్రాలు కొత్త సినిమా ప్రారంభం

వి.ఆర్ చలనచిత్రాలు పతాకంపై  వి.ఇ.వి.కె.డి.ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్న నూతన చిత్రం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. జొనాథన్ ఎడ్వర్డ్స్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విజయ్‌రామ్, శివశక్తి సచ్‌దేవ్ జంటగా నటిస్తున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు సుకుమార్ క్లాప్‌నిచ్చారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యుడు కె. రామ్మోహన్‌రెడ్డి కెమెరా స్విఛాన్‌చేశారు. నటుడు నరేష్ గౌరవదర్శకత్వం వహించారు. నిర్మాతలు థామస్‌రెడ్డి, విజయ్‌ప్రసాద్ స్క్రిప్ట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ అధ్యాపకుడిగా పనిచేస్తున్న రోజుల్నుంచి ప్రసాద్‌తో పరిచయముంది. ఒకే కాలేజీలో కలిసి పనిచేశాం. మా ఇద్దరికీ సినిమాలంటే చాలా ఇష్టం. ఈ సినిమాతో ప్రసాద్ నిర్మాతగా మారుతున్నారు. సినిమాల పట్ల ఆకర్షణ మొదలైన తొలినాళ్లలో రసూల్ ఎల్లోర్ నాకు స్ఫూర్తిగా నిలిచారు.  గాయం, ఒకరికిఒకరుతో పాటు ఆయన సినిమాలన్నీ నచ్చుతాయి. ఈ చిత్ర దర్శకుడు జొనాథన్‌పై రామ్‌గోపాల్‌వర్మ ప్రభావం ఎక్కువగా ఉంది. వైవిధ్యమైన ప్రేమకథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా రధన్ పేరును నేనే సూచించాను.  మంచి సినిమాగా నిలుస్తుందనే నమ్మకముంది అని తెలిపారు. సుకుమార్‌తో తనది 25 ఏళ్ల అనుబంధమని, చక్కటి కథ, కథనాలతో ఈ సినిమాను చేస్తున్నామని, ఇంటిల్లిపాదికి నచ్చే అన్ని అంశాల మిళితంగా ఉంటుందని నిర్మాత పేర్కొన్నారు. దర్శకుడు మాట్లాడుతూ సుకుమార్ లేకపోతే ఈ సినిమాలేదు. ఆయన పెట్టిన పరీక్షలన్నీ పాసైన తర్వాతే ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం దక్కింది. కాంబినేషన్‌లు, హీరోల గురించి ఆలోచించకుండా కెమెరామెన్ రసూల్ ఎల్లోర్ ఈ సినిమా చేయడానికి అంగీకరించడం ఆనందంగా ఉంది.కుటుంబ బంధాలకు ప్రాధాన్యమున్న ప్రేమకథా చిత్రమిది. గులాబీ, గీతాంజలి, సఖి తరహాలో ఫీల్‌గుడ్‌మూవీగా నిలుస్తుంది. ఈ నెలాఖరున చిత్రీకరణ ప్రారంభిస్తాం. రెండు షెడ్యూల్స్‌లో పూర్తిచేస్తాం. హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుతాం.  చాలా కాలం పాటు గుర్తుండిపోయే ఓ మంచి సినిమాగా నిలుస్తుంది అని చెప్పారు. మంచి టీమ్‌తో ఈ సినిమా చేస్తున్నట్లు, నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తున్నట్లు నాయకానాయికలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రసూల్ ఎల్లోర్, నరేష్, రధన్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నరేష్, లక్ష్మీ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ:రసూల్ ఎల్లోర్, ఆర్ట్:రామకృష్ణ,  సంగీతం:రధన్, సంభాషణలు: విస్సా శ్రీకాంత్‌నాయుడు, నిర్మాత: వి.ఇ.వి.కె.డి.ఎస్ ప్రసాద్, దర్శకత్వం:జొనాథన్ ఎడ్వర్డ్స్.

About CineChitram

Check Also

మెగాబ్రదర్‌ నాగబాబుచే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘కళ్యాణ్‌ ఫ్యాన్‌ ఆఫ్‌ పవన్‌’

శ్రీ లక్ష్మీలోహిత క్రియేషన్స్‌ అండ్‌ శ్రీ శరణ్య సినీ చిత్ర కంబైన్స్‌ సంయుక్తంగా సత్య డైరెక్షన్‌లో నిర్మాత టి. రామకృష్ణ …

Leave a Reply

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading