గు౦టూరోడు ట్రైలర్ ని విడుదల చేసిన మోహన్ బాబు

క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్ టైన్ మెంట్స్  పతాకంపై రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా          S.K. సత్య దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం గుంటూరోడు.. ఈ చిత్రం ధియేట్రికల్ ట్రైలర్ ని ‘పద్మశ్రీ కలక్షన్ కింగ్  మంచు మోహన్ బాబు’ గారు విడుదల చేసారు.. అనంతరం అయన మాట్లాడుతూ ట్రైలర్ చాలా అద్భుతంగా వుందని.. దర్శకుడు సత్య ఈ చిత్రాన్ని చాలా బాగా తెరకెక్కించారని, తప్పకుండా ఈ చిత్రం  మనోజ్ బాబు కెరియర్లో మైల్ స్టోన్ గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు.. దర్శకుడు సత్య మాట్లాడుతూ ఈ మద్య విడుదల చేసిన టిజర్ కి అద్భుదమైన రేస్పాన్స్ వచ్చింది.. ఇప్పుడు ఈ ట్రైలర్ మోహన్ బాబు గారు విడుదల చేయడం చాలా ఆనందంగా వుంది.. తప్పకుండా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులుని అలరిస్తుందని తెలిపారు.. అనంతరం ప్రొడ్యూసర్ శ్రీ వరుణ్ అట్లూరి మాట్లాడుతూ జనవరి చివరి వారం లో ఆడియో ని విడుదల చేసి ఫిబ్రవరి 10 న సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు .. ఇంకా ఈ కార్యక్రమంలో  మంచు మనోజ్ బాబు , ఎగ్జిక్యూటివ్  ప్రొడ్యూసర్ ప్రభు తేజ పాల్కొన్నారు..             

మంచు మనోజ్ సరసన కథానాయకిగా ప్రగ్యా జైస్వాల్ (కంచే ఫేమ్) నటించనుండగా

ముఖ్య పాత్రలలో రాజేంద్ర ప్రసాద్, కోటశ్రీనివాసరావు, రావు రమేష్ , సంపత్,  పృథ్వి  ,ప్రవీణ్, సత్య, జెమినీ సురేష్, కాశీ విశ్వనాథ్  తదితరులు నటిస్తున్నారు.

సాంకేతిక వర్గం .. సంగీతం: శ్రీ వసంత్,  సినిమాటోగ్రఫి : సిద్దార్ధరామస్వామి,

ఎడిటర్:  కార్తీక్ శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్టర్: సత్య శ్రీనివాస్,  ఫైట్స్ : వెంకట్ , కొరియోగ్రాఫర్ : శేఖర్, లిరిక్స్ : రామజోగయ్య శాస్త్రి , భాస్కరభట్ల, శ్రీ వసంత్,   కో– డైరెక్టర్ T. అర్జున్, 

ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్:  బుజ్జి,  సురేష్ రెడ్డి ,

ఎగ్జిక్యూటివ్  ప్రొడ్యూసర్: ప్రభు తేజ,

నిర్మాత : శ్రీ వరుణ్ అట్లూరి,

కధ, స్క్రీన్ ప్లే , మాటలు, దర్సకత్వం : S.K. సత్య       

Stills

About CineChitram

Check Also

గౌతమి పుత్ర శాతకర్ణి ట్రైలర్ విడుదల

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading