ఫిబ్ర‌వ‌రి 10న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న డా.గుర్‌మీత్ రామ్ ర‌హీమ్ సింగ్ లెటెస్ట్ సెన్సేష‌న్ “హింద్ కా నాప‌క్ కో జ‌వాబ్‌“ ఎం.ఎస్‌.జి లయ‌న్ హార్డ్ -2

గుర్ మీత్ రామ్ ర‌హీమ్ సింగ్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన ల‌య‌న్ హార్ట్ చిత్రం భారీ క‌లెక్ష‌న్స్‌తో స‌క్సెస్‌పుల్‌గా  అర్ధ శ‌త దినోత్స‌వం పూర్తి చేసుకుంది. ఐదు వారాల‌కే 350 కోట్లకు పైగా క‌లెక్ష‌న్స్‌ను రాబ‌డుతూ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. ఇలాంటి భారీ హిట్‌ను సాధించిన ఎం.ఎస్‌.జి ల‌య‌న్ హార్ట్‌కు సీక్వెల్‌గా డా.గుర్‌మీత్ రామ్ ర‌హీమ్ సింగ్ ఇన్‌సాన్‌, హ‌నీ ప్రీత్ ఇన్‌సాన్ ద‌ర్శ‌క‌త్వంలో  `హింద్ కా  `నాప‌క్ కో జ‌వాబ్“ ఎం.ఎస్‌.జి ల‌య‌న్ హార్ట్ -2 చిత్రాన్ని రూపొందించారు.హ‌కిక‌త్ ఎంట‌ర్‌టైన్మెంట్ ప్రై.లి బ్యాన‌ర్‌పై ఈ సినిమాను నిర్మించారు. 
 ఈ సీక్వెల్‌లో సీక్రెట్ ఏజెంట్ పాత్ర‌లో గుర్‌మీత్ రామ్ ర‌హీమ్ సింగ్ న‌టించారు. రీసెంట్‌గా భారత స‌రిహ‌ద్దుల్లోని పాకిస్థాన్ సైన్యంపై భార‌త దేశ ఆర్మీ నిర్వ‌హించిన స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్ బేస్‌డ్ కాన్సెప్ట్‌తో సాగే క‌థాంశం. ఈ సంద‌ర్భంగా…
గుర్‌మీత్ రామ్ రహీమ్ సింగ్ మాట్లాడుతూ – “దుర‌దృష్ట‌వ‌శాతు మ‌న దేశంలో స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ ఏం చేశారు, ఎలా చేశార‌నే దానిపై ఆధారాలు అడుగుతున్నారు. అటువంటి వారికి ఈ సినిమా ద్వారా స‌మాధానం ఇవ్వ‌బోతున్నాం. ఈ ఆప‌రేష‌న్‌కు సంబంధించిన చాలా వివ‌రాల‌ను ఈ సినిమాలో చూపించ‌బోతున్నాం. జిహాద్ అనే నినాధంతో ముష్క‌రులు యువ‌త‌ను ఎలా పెడ‌తోవ ప‌ట్టిస్తున్నారో మ‌న‌కు తెలుస్తుంది. కానీ అస‌లు జిహాద్ అస‌లు అర్థాన్ని తెలియ‌జేసే ప్ర‌య‌త్నం చేస్తున్నాం. ఇండియాలో హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, సిక్కిం, కేర‌ళ త‌దిత‌ర ప్రాంతాల్లో అద్భుత‌మైన లోకేష‌న్స్‌లో సినిమాను చిత్రీక‌రించాం“ అన్నారు. 
హ‌నీ ప్రీత్ ఇన్‌సాన్ ఈ సినిమాకు కోడైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేయ‌గా, తండియాల్ సినిమాటోగ్ర‌ఫీ విష‌యంలో స‌హ‌కారాన్ని అందించారు. 

About CineChitram

Check Also

మార్చ్ 17 న దిల్ రాజు బ్యానర్ లో విడుదలవుతున్న`వెళ్ళిపోమాకే`

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading