హ్రితిక్ రోషన్ కాబిల్ కు తెలుగు లో టైటిల్ ఖరారు

బాలీవుడ్ సూపర్ స్టార్ హ్రితిక్ రోషన్ మరియు రాకేష్ రోషన్ కాంబినేషన్ లో వస్తోన్న భారీ ఆక్షన్ థ్రిల్లర్ “కాబిల్” . ఈ చిత్రాన్ని తెలుగు లో భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి తెలుగు టైటిల్ “బలం“. 
గతం లో క్రిష్, క్రిష్ 3, కోయి మిల్ గయా, కహో నా ప్యార్ హై వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన ఈ కాంబినేషన్ ఇప్పుడు మళ్ళీ బలం తో తెలుగు ప్రేక్షకుల ముందు కు రాబోతోంది. ఈ చిత్రం లో హ్రితిక్ రోషన్ సరసన యామీ గౌతమ్ హీరోయిన్ గా నటిస్తోంది. 
సంజయ్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తం గా జనవరి 26 2017 న విడుదల అవుతుంది. గతం లో హ్రితిక్ నటించిన క్రిష్ చిత్రాలు మరియు ధూమ్ 2 చిత్రం తెలుగు లో విశేష ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. హ్రితిక్ కి ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణా లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం తో, తెలుగు లో కూడా భారీ విడుదల కు నిర్మాతలు సిద్ధ పడుతున్నారు. 
ఈ చిత్రం మొదటి ట్రైలర్ మరియు లుక్ దీపావళి కానుకగా విడుదల అవుతుంది. “బలం” చిత్రానికి రాజేష్ రోషన్ సంగీతాన్ని అందించారు. 

About CineChitram

Check Also

`గ‌జేంద్రుడు` ఆర్య కెరీర్‌లోనే టర్నింగ్ పాయింట్ మూవీ అవుతుంది – ఆర్‌.బి.చౌద‌రి

Leave a Reply

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading