సెన్సార్ పూర్తిచేసుకున్న ” అనుకోని ఓ కథ “

 ఏ ఎం జె ఫిలిమ్స్ పతాకంపై దర్శక నిర్మాత ఏ ఎం జనార్దన్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ” అనుకోని ఓ కథ ”. రాకేష్ – రమ్య జంటగా రూపొందిన ఈ చిత్రం రాయలసీమ , బెంగుళూర్ , హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది . ఇటీవలే నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తిచేసుకోవడంతో పాటు సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తిచేసుకుంది . బెంగుళూర్ లో సెన్సార్ జరుపుకున్న ఈ చిత్రానికి యు / ఏ సర్టిఫికెట్ ఇచ్చారు . పళని డి సేనాపతి అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అవుతుందని , అలాగే ఎన్నో వ్యయ ప్రయాసాలకోర్చి డీప్ ఫారెస్ట్ లో షూటింగ్ చేశామని , తలకోన అందాలు మరో హైలెట్ గా నిలుస్తాయని అంటున్నాడు దర్శక నిర్మాత ఏ ఎం జనార్దన్ .

తక్కువ బడ్జెట్ లో పరిమిత రోజుల్లో తెరకెక్కించిన చిత్రం మా ” అనుకోని ఓ కథ ” అని తప్పకుండా ప్రేక్షకులను అలరించేలా మా సినిమా ఉంటుందని ధీమా వ్యక్తం చేసారు హీరో , హీరోయిన్ లు రాకేష్ – రమ్య . శ్రవణ్ ,కార్తీక్ , వాసవిరెడ్డి , రమ్యశ్రీ , మాదీ ,వెంకటరమణ ,తేజ ,అమృత ,రాజేంద్ర ,జ్యోతి , డబ్బింగ్ సురేష్ ,అర్జున్ రెడ్డి ,రాధాకృష్ణ ,అర్జున్ ,సోనీ తదితరులు నటించిన ఈ చిత్రానికి సురేష్ బాబు ఛాయాగ్రహణం అందించాడు . కాగా ఈ చిత్రాన్ని మేలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాత ఏ ఎం జనార్దన్ .

Stills

About CineChitram

Check Also

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘నువ్వు నేను ఒసెయ్ ఒరెయ్’

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading