జనతా గారేజ్ విజయోత్సవం

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, సమంత, నిత్యామీనన్‌ హీరో హీరోయిన్లుగా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై కొరటాల శివ దర్శకత్వంలో ఎర్నేని నవీన్‌, యలమంచిలి రవిశంకర్‌, సి.వి.మోహన్‌ నిర్మించిన చిత్రం’జనతాగ్యారేజ్‌’. సెప్టెంబర్‌ 1న సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా మంగళవారం చిత్రయూనిట్‌ హైదరాబాద్‌ జె.ఆర్‌.సి.కన్వెన్షన్‌లోవిజయోత్సవంను నిర్వహించింది. ఈ సందర్భంగా….

`జనతా గ్యారేజ్` విజయం అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ మాట్లాడుతూ – ”`జనతాగ్యారేజ్` లాంటి భారీ సక్సెస్ సాధించి పదమూడేళ్ళైంది.  ఒకవైపు ఆనందంతో వచ్చే ఏడుపును ఆపుకుంటున్నాను. అభిమానులను సంతోషపరచడానికే నేను ఇక్కడ ఉన్నాను. జనతాగ్యారేజ్‌ విజయం కొత్త ఊపిరిని, కొత్త ఆనందాన్ని ఇచ్చింది. బ్రతికినంత కాలం అభిమానుల ప్రేమను, అప్యాయతను పొందాలనే కోరుకుంటున్నాను. `జనతాగ్యారేజ్` ఆడియో ఫంక్షన్ లో నాకు ఒక వెలుగు కనిపిస్తుంది, ఆ వెలుగు `జనతాగ్యారేజ్‌` అని అనిపిస్తుందని చెప్పాను.  `జనతాగ్యారేజ్‌` వల్ల అభిమానుల ముఖాల్లో సంతోషం, నా తల్లిదండ్రుల పుట్టినరోజున మంచి గిఫ్ట్‌ ఇచ్చిన వాడినయ్యాను. నేను, కల్యాణ్‌ రామ్‌ అన్నయ్య చాలా బాధగా ఉందని చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇలాంటి విజయం కోసమే నేను ఇనేళ్ళు ఆగాను. నా వెనుక నా అభిమానులు ఆగారు. అయితే సినిమా సెప్టెంబర్‌ 1న విడుదలైనప్పుడు చాలా రకాల రిపోర్ట్స్‌ వచ్చినప్పుడు కాసేపు ఏం మాట్లాడాలో, ఎలా రియాక్ట్‌ కావాలో తెలియలేదు. శివపై, ఈ కథపై పెట్టుకున్న నమ్మకం, అభిమానులకు ఇచ్చిన మాట తప్పు కాకూడదే అని లోపల చాలా బాధ పడిపోయాను. కానీ అదే రోజుల అభిమానుల నుండి సాయంత్రం రిపోర్ట్స్‌ వింటుంటే ఈ మాటలు వినడానికి నాకు ఇన్నేళ్ళు పట్టిందా, ఇంతకంటే నాకేం అవసరం లేదనిపించింది. `జనతాగ్యారేజ్‌` సినిమాను ఇచ్చిన కొరటాల శివగారికి ఆజన్మాంతం రుణపడి ఉంటాను. నాపై అభిమానులు పెట్టుకున్న నమ్మకాన్ని ఈ సినిమాతో నిజం చేశారు. నా గుండెలో, అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విజయమిది. ఇంత పెద్ద విజయంలో భాగమైన నటీనటులకు, టెక్నిషియన్స్‌ కు థాంక్స్‌. జనతా గ్యారేజ్‌ అని ఏ రోజైతే టైటిల్‌ పెట్టుకున్నామో ఆరోజు ప్రజలు మమ్మల్మి గుండెల్లో పెట్టుకుని తలెత్తుకునేలా చేశారు. ఇంతటి విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికీ థాంక్స్” అన్నారు.

అమ్మ, నాన్నల షష్ఠి పూర్తికి అభిమానులు ఇచ్చిన గిఫ్ట్

కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ – ”అభిమానులు..ఆకలి తీరిందా…నాకు, నా తమ్ముడికి ఆకలి తీరింది. గత మూడేళ్ళుగా ప్రతిరోజు, ప్రతిసారి నేను, తమ్ముడు గూబ గుయ్‌ మనేలా ఎప్పుడు కొడతాం అని అనుకునేవాళ్ళం. కొడితే ఎలా ఉంటుందో మీరు చూపించారు. మా అమ్మ,నాన్నగారి షష్టి పూర్తికి అభిమానులు మాకిచ్చిన గిఫ్ట్‌ ఇది. మా తమ్ముడు ఆకలి..మా నందమూరి అభిమానుల ఆకలిని ఇంత గొప్ప సక్సెస్‌తో తీర్చేసిన కొరటాల శివ గారికి, మైత్రీ మూవీ మేకర్స్‌ కి థాంక్స్‌” అన్నారు.

`జనతాగ్యారేజ్` ను తమదిగా భావించిన అభిమానులకు థాంక్స్…జయహో జనతా…

కొరటాల శివ మాట్లాడుతూ – ”ఎన్టీఆర్‌ అంటనే నాకు సపరేట్‌ ఎనర్జీ. తారక్‌కి సక్సెస్‌ కొత్తకాదు. అయినా ఈ సక్సెస్‌లో నేను కూడా భాగం అయినందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మోహన్‌లాల్‌,సురేష్‌, సాయికుమార్‌, సమంత, నిత్యామీనన్‌, దేవిశ్రీ ప్రసాద్‌ ఇలా అందరి సపోర్ట్‌ తో పాటు ఈ సినిమాను తమదిగా భావించిన అభిమానుల కారణంగానే సినిమా పెద్ద సక్సెస్‌ అయ్యింది. టెంపర్‌ నుండి రూట్‌ మార్చి కొత్తగా చేస్తున్నారు. అలా చేయడం ఆడియెన్స్‌ కు నచ్చింది, ఆదరిస్తున్నారు. అభిమానులు ఆదరణ ఇలాగే కొనసాగితే టెంపర్‌, నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్‌ వంటి సినిమాలు ఎన్నింటినో చేస్తారు. అలాగే ఈ సినిమాను పెద్ద సక్సెస్‌ చేసిన ఆడియెన్స్‌ కు పెద్ద థాంక్స్‌. జయహో జనతా” అన్నారు.

కమర్షియల్ సినిమాలకు కొరటాల కొత్త దారి చూపించాడు….

సుకుమార్‌ మాట్లాడుతూ – ”సినిమా చూసి షాకయ్యాను. సినిమా బావుంది. తారక్‌కు ఫోన్‌ చేసి బావుందని చెప్పాను కానీ, ఎక్కడో డౌట్‌ ఉండేది. అయితే సినిమా విడుదలైన తర్వాత తారక్‌కు ఇలాంటి సినిమా అవకాశం వస్తే ఎలా కొడతాడని ప్రూవ్‌ చేసిన చిత్రమిది. సినిమా తీయడానికి కామెడి అక్కర్లేదు అని నమ్మే వాళ్లందరికీ కొరటాల శివ దారి చూపించాడు. సినిమా చరిత్రలో శివ ముందు, శివ తర్వాత అని ఎలా చెబుతారో, ఇకపై కమర్షియల్‌ సినిమా విషయానికి వస్తే, కొరటాల శివకు ముందు, కొరటాల శివకు తర్వాత అని చెబుతారు. అందులో నో డౌట్‌. నన్ను అంత బాగా ఇన్‌స్పైర్‌ చేశారు. నిర్మాతలు మరోసారి పెద్ద సక్సెస్‌ను అందుకున్నారు. ఈ సినిమాను పెద్ద సక్సెస్‌ చేసిన నిర్మాతలకు కంగ్రాట్స్‌” అన్నారు.

ఎన్టీఆర్ గారు మా బ్యానర్ లో ఇంకా సినిమాలు చేయాలి

ఎర్నేని నవీన్‌ మాట్లాడుతూ – ”ఇలాంటి మంచి పెద్ద హిట్‌ మూవీ చేసే అవకాశం ఇచ్చిన ఎన్టీఆర్‌ గారికి, దర్శకుడు కొరటాల శివ గారికి థాంక్స్‌. సినిమాను సక్సెస్‌ చేసిన ప్రేక్షకులకు స్పెషల్‌ థాంక్స్‌. ఎన్టీఆర్‌ గారు, కొరటాల శివ గారు మా బ్యానర్‌లో ఇంకా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాం” అన్నారు. 

 

ఈ కార్యక్రమంలో సాయికుమార్ డి.వి.వి.దానయ్య, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, సురేష్, దిల్ రాజు సహా చిత్రయూనిట్ సభ్యుల పాల్గొన్నారు. నిర్మాతలు అతిథులు, చిత్రయూనిట్ సభ్యులను షీల్డ్స్ తో సత్కరించి అభినందనలు తెలియజేశారు.  

About CineChitram

Check Also

మెట్రో` సినిమా స‌క్సెస్ మీట్!!

Leave a Reply

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading