#KhaidiNo150 సినిమాకు చిరంజీవితో కలిసి పనిచేయనున్న రాఘవ లారెన్స్

డ్యాన్సుల్లో కొత్త ఒర‌వడి సృష్టించిన బెస్ట్ డ్యాన్సింగ్ స్టార్ ఎవ‌రు?
అంటే మెగాస్టార్ చిరంజీవి పేరే త‌ల‌చుకుంటారు. అన్న‌య్య స్టెప్పుల్లో
ఎన‌ర్జీ.. ఆ హుషారు గురించి ఎంత చెప్పినా త‌క్కువే. 90ల‌లో అస‌లు బ్రేక్
డ్యాన్స్ అన్న ప‌దానికే ప‌ర్యాయ‌ప‌దంగా నిలిచిన చిరు కెరీర్ ఆద్యంతం
డ్యాన్సింగ్‌లో చేసిన ప్ర‌యోగాలు అసాధార‌ణం. ఇప్ప‌టికీ, ఎప్ప‌టికీ  చిరు
ల్యాండ్ మార్క్ స్టెప్పుల గురించి, డ్యాన్సింగ్ స్ట‌యిల్ గురించి
న‌వ‌త‌రం మాట్లాడ‌కుండా ఉండ‌రు. నేటి త‌రం హీరోలు, కొరియోగ్రాఫ‌ర్లు
డ్యాన్సులు ఏ స్థాయిలో చేయ‌గ‌లిగినా చిరు స్టైల్ డ్యాన్సులు చేయ‌డం
క‌ష్ట‌మేన‌ని అంగీక‌రిస్తారు. అందుకే అప్ప‌టికీ ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ
డ్యాన్సుల్లో మెగాస్టార్ ఒక్క‌రే. ఆయ‌న స్టైల్ యూనిక్‌. ఆయ‌న
మేన‌రిజ‌మ్స్ ఎక్స్‌క్లూజివ్‌.
ప్ర‌స్తుతం మెగాస్టార్ `ఖైదీ నంబ‌ర్ 150` కోసం డ్యాన్సింగ్ మోడ్‌లోకి
వెళ్లిపోయారు. మ‌రోసారి త‌న‌దైన శైలిలో యూనిక్ స్టెప్పుల‌తో
అల‌రించేందుకు రెడీ అవుతున్నారు. హైద‌రాబాద్ -అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో
మెగాస్టార్ చిరంజీవి – ల‌క్ష్మీరాయ్‌పై రాఘ‌వ లారెన్స్ మాష్ట‌ర్
కొరియోగ్ర‌ఫీలో భారీ సెట్‌లో ఓ స్పెష‌ల్ సాంగ్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ
పాట‌కు దేవీశ్రీ లిరిక్ అందించ‌డ‌మే కాకుండా అదిరిపోయే ట్యూన్ క‌ట్టారు.
మూవీ హైలైట్ సాంగ్స్‌లో ఇదొక‌టిగా నిలుస్తుంద‌ని యూనిట్ చెబుతోంది.
మెగాస్టార్ – లారెన్స్ కాంబినేష‌న్ అన‌గానే మ‌న‌కు కొన్ని పాట‌లు విధిగా
గుర్తుకొస్తాయి. `హిట్ల‌ర్‌` మూవీలో “అబీబీ అబీబీ .. ` అంటూ చిరు వేసిన
స్టెప్పులు క‌నుల ముందు క‌దులాడ‌తాయి. `, `ఇంద్ర‌`లో  “దాయి దాయి
దామ‌… కులికే కుంద‌నాల కొమ్మ‌..“ సాంగ్‌లో వీణ స్టెప్ ఇప్ప‌టికీ హాట్
టాపిక్‌. “కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలి…`, “మ‌న్మ‌ధ మ‌న్మ‌ధ
..“ సాంగ్స్‌(ఇంద్ర‌) కి లారెన్స్ మాష్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ
గుర్తుకొస్తుంది. మ‌ళ్లీ చాలా గ్యాప్ త‌ర్వాత లారెన్స్ ..  మెగాస్టార్‌కి
స్టెప్పులు అందిస్తున్నారు. 150వ సినిమాతో మ‌ళ్లీ ఈ క‌ల‌యిక‌లో మ‌రో
మైండ్ బ్లోవింగ్ పెర్ఫామెన్సెస్‌ని  తెలుగు ప్రేక్ష‌కులు వీక్షించే
ఛాన్సుంద‌ని చెబుతున్నారు. పాట‌ల చిత్ర‌ణ‌తో పాటు బ్యాలెన్స్ షూటింగ్‌ని
పూర్తి చేసి సైమ‌ల్టేనియ‌స్‌గా నిర్మాణానంత‌ర ప‌నులు సాగిస్తాం.
సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రిలో సినిమా రిలీజ్ చేస్తామ‌ని నిర్మాత రామ్‌చ‌ర‌ణ్
ఇదివ‌ర‌కే తెలిపారు.

About CineChitram

Check Also

తెలుగు సినిమా ని ఉరితీయ‌కండి…. ‘క‌త్రిన,క‌రీన‌,మ‌ద్య‌లో’ క‌మ‌ల్‌హ‌స‌న్ ద‌ర్శ‌కుడు ర‌త్న‌

Leave a Reply

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading