`నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్‌` ఆడియో రిలీజ్!

శ్రీ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం-1గా రిమ్మ‌ల‌పూడి వీర‌గంగాధ‌ర్ నిర్మిస్తున్న చిత్రం `నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్‌`. ర‌విచంద్ర క‌న్నికంటి ద‌ర్శకుడుగా ప‌రిచ‌యం అవుతున్నాడు. అర్జున్ మ‌హి, అశ్విని జంట‌గా న‌టిస్తున్నారు. సుమ‌న్ జూపూడి సంగీతాన్ని స‌మ‌కూర్చిన ఈ చిత్ర ఆడియో విడుద‌ల కార్యక్ర‌మం హైద‌రాబాద్ లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రేలంగి న‌ర‌సింహారావు, వీర‌శంక‌ర్, దేవిప్ర‌సాద్, సాయివెంక‌ట్, సీడీల‌ను ఆవిష్క‌రించారు. 
“సినిమా టైటిల్ చాలా ట్రెండీగా ఉంది. పాట‌లు, ట్రైల‌ర్స్ కూడా  యువ‌త‌ను ఆక‌ట్టునే విధంగా ఉన్నాయి. ద‌ర్శ‌కుడిలోని ప్ర‌తిభ ట్రైల‌ర్ చూస్తే అర్ధ‌మ‌వుతుంది. అలాగే నిర్మాత ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా సినిమా నిర్మించిన‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమా స‌క్సెస్ సాధించి ద‌ర్శ‌క నిర్మాత‌ల‌తో పాటు యూనిట్ అంద‌రికీ మంచి పేరు రావాల‌న్నారు.
ద‌ర్శ‌కుడు ర‌విచంద్ర క‌న్నికంటి మాట్లాడుతూ…“ఇదొక ల‌వ్లీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన్ మెంట్ మూవీ. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే విధంగా సినిమా ఉంటుంది. టైటిల్ కు ఇప్ప‌టికే మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సుమ‌న్ జూపూడి గారు అద్భుత‌మైన పాట‌లిచ్చారు. మా నిర్మాత ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా సినిమాను నిర్మించారు. మా ఆడియోతో  పాటు సినిమాను కూడా పెద్ద స‌క్సెస్ చేస్తార‌ని కోరుకుంటున్నా“ అన్నారు.
నిర్మాత వీర‌గంగాధ‌ర్ రిమ్మ‌ల‌పూడి మాట్లాడుతూ…“ద‌ర్శ‌కుడు ర‌విచంద్ర చెప్పిన దానికంటే కూడా సినిమాను చాలా బాగా చిత్రీక‌రించారు. అర్జున్ మ‌హి, అశ్విని జంట బాగుందంటున్నారు. ఆడియో సినిమాకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌. మా తొలి ప్రయ‌త్నాన్ని ఆడియ‌న్స్ ఆద‌రించాల‌ని కోర‌కుంటున్నా“ అన్నారు.
హీరో హీరోయిన్స్ మాట్లాడుతూ…“ఒక మంచి సినిమాలో న‌టించే అవ‌కాశం క‌ల్పించినందుకు ద‌ర్శ‌క నిర్మాత‌లకు ధ‌న్య‌వాదాలు తెలుపుకుంటున్నాం. సుమ‌న్ జూపూడి గారి పాట‌లు అంద‌ర్నీ అల‌రిస్తాయ‌న్నారు.
ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు.
థ‌ర్టీ ఇయ‌ర్స్ పృథ్వీ, జ‌బ‌ర్ద‌స్త్ అప్పారావు, కేదార్ శంక‌ర్ .యం, నిర్మల‌, రింగ్ ర‌మేష్‌, గంగాధ‌ర్, రితిక‌, రాధ‌, ఉమ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి కెమెరాఃవాసు బొజ్జా, సంగీతంః సుమ‌న్ జూపూడి, కొరియెగ్ర‌ఫీఃన‌రేశ్ ఆనంద్, పాట‌లుఃధీరేంద్ర‌, ఈమ‌ని, ఎడిట‌ర్ఃర‌వీంద్ర‌బాబు.కె, నిర్మాతఃవీర‌గంగాధ‌ర్ రిమ్మ‌ల‌పూడి, క‌థ‌-క‌థ‌నం-మాట‌లు-ద‌ర్శ‌క‌త్వంః ర‌విచంద్ర క‌న్నికంటి.

Stills

About CineChitram

Check Also

`కాట‌మ‌రాయుడు` చిత్రంలో `జివ్వు జివ్వు..` సాంగ్ రిలీజ్ చేసిన అనూప్‌

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading