డిస్ట్రిబ్యూష‌న్ రంగంలోకి డి.వి.సినీ క్రియేష‌న్స్ అధినేత డి.వెంక‌టేష్‌

సినిమా ఫీల్డ్‌పై ఆస‌క్తితో నిర్మాత‌గా సినీ రంగ ప్ర‌వేశం చేసిన వ్య‌క్తి డి.వెంక‌టేష్. మంచి చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించాల‌నే ఆస‌క్తితో డి.వి.సినీ క్రియేష‌న్స్ అనే నిర్మాణ సంస్థ‌ను స్థాపించారు డి.వెంక‌టేష్‌. ప్ర‌స్తుతం డి.వి.సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎంత వ‌ర‌కు ఈ ప్రేమ‌, అందాల ప్రేయ‌సి, పిజ్జా2 చిత్రాల‌ను తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. సినిమాల‌ను నిర్మించ‌డం కంటే విడుద‌ల చేయ‌డం క‌ష్ట‌మైపోతున్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో చిన్న చిత్రాల నిర్మాత‌లు థియేట‌ర్స్ దొర‌క్క సినిమాల‌ను అనుకున్న విధంగా విడుద‌ల చేయ‌లేక‌పోతున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నించి, వాటి నుండి చిన్న నిర్మాత‌ల‌కు త‌న‌కు తోచినంత స‌పోర్ట్ అందించ‌డానికి డి.వెంక‌టేష్ డిస్ట్రిబ్యూష‌న్ రంగంలోకి అడుగుపెడుతున్నారు. 
చిన్న నిర్మాతల ప‌రిస్థితుల‌ను అర్థం చేసుకున్న వ్య‌క్తిగా చిన్న సినిమాల‌కు తోడ్పాటును అందించే ప్ర‌య‌త్న‌మే ఇది. చిన్న చిత్రాల‌తో పాటు భారీ బ‌డ్జెట్ చిత్రాల‌ను కూడా విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. డిస్ట్రిబ్యూష‌న్ రంగంలో రావ‌డం కొత్త‌గా ఉన్న‌ప్ప‌టికీ త‌న శ‌క్తి మేర చిన్న చిత్రాల‌కు అండ‌గా నిల‌బ‌డ‌తాన‌ని డి.వి.సినీ క్రియేష‌న్స్ అధినేత డి.వెంక‌టేష్ తెలియ‌జేశారు.

Stills

About CineChitram

Check Also

మార్చి 29 ఉగాది ప‌ర్వ‌దినాన సునీల్ న‌టించిన‌ “ఉంగరాల రాంబాబు టీజ‌ర్ విడుద‌ల‌