వంశీ, బాపు, ప్రియదర్శన్, రామ్‌గోపాల్‌వర్మ వంటి దిగ్గజ దర్శకుల స్పూర్తితోనే చిత్రసీమలో అడుగుపెట్టానని అంటున్నారు శివరాజ్ కనుమూరి. సహజత్వంతో కూడిన మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతోనే “జయమ్ము నిశ్చయమ్ము రా” చిత్రాన్ని తెరకెక్కించాను అన్నారు. ఆయన దర్శకత్వం వహిస్తూ సతీష్ కనుమూరితో కలసి నిర్మించిన చిత్రం “జయమ్ము నిశ్చయమ్ము రా”. ఇటీవలే ఈ చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా శివరాజ్ కనుమూరి పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి.
తూర్పుగోదావరి జిల్లాలోని మట్టపర్రు నా స్వస్ధలం. ఎమ్మెస్సీ కంప్యూటర్స్ పూర్తిచేశాను. లండన్‌లో నాలుగేళ్లపాటు ఉద్యోగం చేశాను. దర్శకుడిని కావాలనే సంకల్పంతో వర్మ కార్పోరేషన్లో అసిస్టెంట్‌గా కెరీర్‌ను మొదలుపెట్టాను. రామ్‌గోపాల్‌వర్మ, జెడి చక్రవర్తి వద్ద పలు సినిమాలకు పనిచేశాను. “జయమ్ము నిశ్చయమ్ము రా” చిత్రంతో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే పెద్ద విజయాన్ని అందుకోవడం ఆనందంగా ఉంది. కథలోని భావోద్వేగాలతో ప్రేక్షకులు సహానుభూతి చెందుతున్నారు. ప్రతి ఒక్కరూ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు.
సమైక్యంగా నవ్వుకుందాం…
తొలుత కొత్త హీరోతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని అనుకున్నాను. అమాయకుడైన పక్కింటి అబ్బాయి పాత్రకు శ్రీనివాస్‌రెడ్డి అయితే న్యాయం చేయగలడని అనిపించింది. కథ చెప్పగానే ఆయన సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలసి ఉన్న సమయంలో 2013 సంవత్సరం నేపథ్యంలో కథ సాగుతుంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన యువకుడు ఆంధ్రా ప్రాంతంలో ఉద్యోగం చేయాల్సి వస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడు అనే అంశానికి వినోదం, సెంటిమెంట్ మిళితం చేసి కథను చేసుకున్నాను. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా సున్నితమైన భావోద్వేగాలతో సినిమా సాగుతుంది. కుటుంబమంతా కలసి చూసే సినిమా ఇది. అంతేకాకుండా రెండు రాష్ర్టాలకు సంబంధించిన కథ కావడంతో సమైక్యంగా నవ్వుకుందాం అని సినిమాలో చాటిచెప్పాం.

దేశవాళీ వినోదం..
మనచుట్టు పక్కల నిత్య జీవితంలో తారసిల్లే వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకొని ఇందులో పాత్రలను సృష్టించాను. పంచ్ డైలాగ్‌లు, ప్రాసల జోలికి పోకుండా పూర్తిగా నిజ జీవితంలో ఎలా మాట్లాడుకుంటామో అలాంటి సంభాషణలే ఉపయోగించాం. సెట్స్ వేయకుండా నిజమైన లొకేషన్స్‌లోనే సినిమాను తెరకెక్కించాం. సహజత్వానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చాం. ఈ దేశవాళీ వినోదం అందరినీ మెప్పిస్తోంది. రావిశాస్త్రి రచించిన అల్పజీవి నవల నన్ను చాలా ఆకట్టుకుంది. అందులోని అంశాలను సినిమా రూపంగా మలిస్తే బాగుంటుందని అనిపించింది.
సుకుమార్ అవకాశమిచ్చారు. తొలి సినిమాతోనే కృష్ణభగవాన్, పోసాని కృష్ణమురళి, శ్రీనివాస్‌రెడ్డి లాంటి సీనియర్ నటీనటులతో కలసి పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది. వినూత్న కథాంశంతో రూపొందిన చిత్రం కావడంతో ఇండస్ట్రీ వర్గాలు మాకు అండగా నిలిచాయి. సుకుమార్, కొరటాల శివ, వక్కంతం వంశీ, అనిల్ రావిపూడి సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బాగుందని మెచ్చుకున్నారు. వారు ఇచ్చిన ప్రోత్సాహం వల్లే మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ప్రస్తుతం “జయమ్ము నిశ్చయమ్ము రా” విజయోత్సాహాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్నాను.