సీనియర్ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డి ఉయ్యూరు మంగళవారం హైదరాబాద్ అపోలో హాస్పిటల్‌లో అనారోగ్యంతో కన్నుమూశారు. సీనియర్ డైరెక్టర్ సాగర్‌కు శ్రీనివాస్‌రెడ్డిగారు సోదరుడవుతారు. సినిమాటోగ్రాఫర్‌గానే కాకుండా మౌళి, సుధాకర్‌బాబు, సాగర్‌లతో కలిసి మౌళి క్రియేషన్స్ బ్యానర్‌పై సూపర్‌స్టార్ కృష్ణతో జగదేకవీరుడు, అమ్మదొంగా వంటి సినిమాలను నిర్మించారు. నిర్మాత చంటి అడ్డాలతో కలిసి శ్రీనివాస ఆర్ట్స్ బ్యానర్‌పై బాలకృష్ణతో పవిత్రప్రేమ, కృష్ణబాబు, వినీత్, సౌందర్యలతో ఆరోప్రాణం, పూరిజగన్నాథ్, జగపతిబాబుతో బాచి, శ్రీకాంత్ హీరోగా సీనియర్ జర్నలిస్ట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన మొండోడు సినిమాలను నిర్మించాచారు. రీసెంట్‌గా రష్మీ గౌతమ్ ప్రధానపాత్రలో రూపొందిన `చారుశీల` సినిమాకు దర్శకత్వం వహించారు. టెక్నిషియన్‌గా, దర్శక నిర్మాతగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస్‌రెడ్డి ఉయ్యూరు మరణం పట్ల ఆయన కుటుంబ సభ్యులకు తెలుగు సినిమా ఇండస్ట్రీ సంతాపాన్ని వ్యక్తం చేసింది. రేపు హైదరాబాద్‌లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయి.
Tags cameraman journalist sreenivas reddu sreenivas reddy uyyuru sreenivas reddy
Check Also
గంటా రవి, జయంత్ సి. పరాన్జీల ‘జయదేవ్’ 3వ సాంగ్ ప్రోమో విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి హీరోగా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై డీసెంట్ …