ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణ రావు ఇటీవల అనారోగ్యం కారణంగా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దాసరిని పరామర్శించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం తెలంగాణ రాష్ర్ట సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ దాసరిని పరామర్శించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ` దాసరి గారు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తండ్రి లాంటి వారు. పరిశ్రమలో ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా ముందుండి పరిష్కరిస్తారు. అంత గొప్ప వ్యక్తి అనారోగ్యానికి గురి కావడం కలచి వేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మొరుగు పడుతోంది. త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్ధిస్తున్నారు. వారి దీవెనలే ఆయన్ను రక్షించాయి. రెండు, మూడు రోజుల్లో ఆయన పూర్తిగా కోలుకుంటారు. ఆయన ఆరోగ్యంపై ప్రతిరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ డాక్టర్ల ను సంప్రదించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారని` అన్నారు.
Cine Chitram Telugu Cinema World
