రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్

ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు విడిపోయాక ఎంతో మంది  చాంబర్స్  ఏర్పాటు చేయాలని ,ప్రయత్నించినప్పటికీ 
తెలంగాణ రాష్ట్ర సినిమా సెన్సార్ క్లియరెన్స్  మరియు టైటిల్  రిజిస్ట్రేషన్ పెర్మిషన్ సాధించటంలో ప్రతాని రామకృష్ణ గౌడ్ ఎన్నో కష్టాలకోర్చారు.అనుకున్నట్టుగానే టి ఎఫ్ సి సి ని  సాధించారు.రెండు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేయటం కొన్ని సినిమాలకు సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వటం కూడా జరిగింది.ఈ మధ్యే టి ఎఫ్ సి సి కొత్త జనరల్ బాడీ ని ఎన్నుకోవటంజరిగిందని పాత్రికేయుల సమావేసం ఏర్పాటు చేసారు.తమ తదుపరి కార్యాచరన వివరాలు తెలిపారు.ఈ కార్యక్రమానికి టి ఎఫ్ సి సి చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్.వైస్ చైర్మన్ రంగా రవీంద్ర గుప్త. సెక్రటరీ లయన్ సాయి వెంకట్  పాల్గొన్నారు 
టి ఎఫ్ సి సి చైర్మన్ ప్రతాని రామ కృష్ణ గౌడ్ మాట్లాడుతూ …టి ఎఫ్ సి సి ఏర్పాటుకు రాష్ట్ర ముఖ్యమంత్రివర్వ్యలు కె. చంద్రశేఖర్ రావు ప్రోత్సాహం మర్చిపోలేనిది.అలాగే కేంద్ర మంత్రులు  వెంకయ్య నాయుడు, దత్తాత్రేయ గారు, రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి  తలసాని శ్రీనివాస యాదవ్ గారు సపోర్టు మర్చిపోలేనిది.టి ఎఫ్ సి సి  లో  1000 మంది నిర్మాతలు.24 క్రాఫ్ట్స్ లో సుమారు 3000 సభ్యులు ఉన్నారు. వీరందరికి హెల్త్ కార్డ్స్  (కేంద్ర ప్రభుత్వ హెల్త్ స్కీమ్) ఇప్పించటం జరుగుతుంది  అలాగే వారి పిల్లలకు స్కాలర్షిప్ కూడా ఇప్పిస్తాం ఈ స్కీమ్ ఫామిలీ మొత్తానికి వర్తిస్తుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు..అలాగే తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీస్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రిజిస్ట్రేషన్ కూడా వచ్చింది.కె సి ఆర్  సినిమా పరిశ్రమ పై త్రిసభ్య కమిటీ వేశారు వారిలో కె టి ఆర్  తుమ్మల నాగేశ్వరావు 
తలసాని శ్రీనివాసయాదవ్ ఈ ముగ్గురు మేము చెప్పిన సమస్యలని పరిష్కరించబోతున్నారు.వాటిలో చిన్నసినిమాలకు 5 ఆట, చిత్రపురి కాలనీ లో ఇల్లు లేనివారికి 9 ఎకరాలు కేటాయించటం జరిగింది, ప్రభుత్వం తరుపున ఫిలిం ఇన్స్టిట్యూట్ ఏర్పాటు వంటివి చర్చించడం జరిగింది ఇక జి ఓ రావటమే ఆలస్యం, సినిమా పరిశ్రమకు ముఖ్యమంత్రి చేస్తున్న కృషి ఎందరో కార్మికుల్లో సంతోషాన్ని నింపుతుందని 
కె సి ఆర్ గారికి కృతఙ్ఞతలు అన్నారు.
 
వైస్ చైర్మన్ రంగా రవీంద్ర గుప్త మాట్లాడుతూ ..సినిమా పరిశ్రమకు సంబంధించిన ప్రతి సమస్యను పరిష్కరించడానికి రామకృష్ణ గౌడ్ గారితో కలిసి నడుస్తాం.. అన్నారు 
 
సెక్రెటరీ సాయి వెంకట్ మాట్లాడుతూ …టి ఎఫ్ సి సి రెండు సంవత్సరాలు నిండటానికి రామకృష్ణ గౌడ్ గారి 
కృషి ఎంతో ఉంది ఆయన పట్టుదలతో తెలంగాణకు ప్రత్యేక ఫిలిం ఛాంబర్ రావటం ఆనందదాయకం.మల్లి మమ్మలి ఎన్నుకున్నందుకు కృతఙ్ఞతలు ఆయన అడుగుజాడల్లో నడిచి పరిశ్రమకు మంచి చేయడానికి 
కృషి చేస్తాం అన్నారు..

Stills

About CineChitram

Check Also

టీచ్ ఫర్ చే౦జ్ ఎన్ జీ వో కు సహకారమ౦ది౦చిన రకుల్ ప్రీత్

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading