యంగ్ హీరో నాగ అన్వేష్ బర్త్ డే సెలబ్రేషన్ నిన్న(మార్చి 24న) ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ లో జరిగాయి. ఈ వేడుకకు ఫిల్మ్ మీడియా ప్రతినిధులతో పాటు, ఏంజెల్ చిత్రం నిర్మాత భువన్ సాగర్, డైరెక్టర్ బాహుబలి పళని తదితరలు హాజరైయ్యారు. అనంతరం సీనియర్ జర్నలిస్టులు శ్రీ పసుపులేటి రామారావు గారు, శ్రీ వినయకరావు గారు తదితరుల సమక్షంలో నాగ అన్వేష్ బర్త్ డే కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా నాగ అన్వేష్ మాట్లాడుతూ, మీడియా సమక్షంలో పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఏంజెల్ తో కచ్చితంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తానని. శ్రీ సరస్వతి ఫిల్మ్ బ్యానర్ నుంచి గత ఏడాది వచ్చిన మన్యంపులి తరువాత అదే స్థాయిలో గ్రాఫిక్స్ హంగులతో ఏంజెల్ రెడీ అవుతుందని తెలిపారు.
Cine Chitram Telugu Cinema World
