ఇళయదలపతి విజయ్ నటించిన తాజా చిత్రం ‘ది గోట్’ గ్రాండ్ విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దర్శకుడు వెంకట్ ప్రభు సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలో ఓ విలేకరి విజయ్, అజిత్ ల మధ్య తేడా ఏంటని ప్రశ్నించారు.
విజయ్, అజిత్‌లతో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. ఇద్దరు హీరోలు కూడా చాలా సింపుల్‌గా ఉంటారు. అయితే, సెట్స్‌లో అజిత్ చిన్నపిల్లాడిలా ఫన్ చేస్తూ, మాట్లాడుతూ ఉంటాడని.. కానీ, విజయ్ చాలా సైలెంట్‌గా ఉంటారని వెంకట్ ప్రభు పేర్కొన్నారు. ఈ ఇద్దరు హీరోలను డైరెక్ట్ చేయడం తనకు సంతోషంగా ఉందని ఆయన తెలియజేశారు.
The post ఇద్దరికీ అదే తేడా! first appeared on Andhrawatch.com.