అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి సినిమా కూడా ఒకటి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా చేస్తుండగా, ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ కి సంబంధించిన అప్డేట్ త్వరలో వెలువడనుంది. అయితే ఈ సినిమాలోని ఒక పవర్ ఫుల్ ట్రాక్ కు ప్రముఖ కోలీవుడ్ యాక్టర్, సింగర్ శింబు తన గాత్రాన్ని ఇచ్చినట్లు సమాచారం. దీనిపై మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
The post ఓజీలో ఆ కోలీవుడ్ స్టార్ నటుడు! first appeared on Andhrawatch.com.