అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ ల మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ డబుల్ ఇస్మా ర్ట్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తా పడింది. సినిమా ఓపెనింగ్స్ ను కూడా రాబట్టడంలో తీవ్రంగా విఫలం అయ్యింది. రామ్ ఫ్యాన్స్ ఈ విషయం పట్ల కాస్త అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే రామ్ నటించబోయే తరువాత సినిమా కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మహేష్ బాబు డైరెక్షన్ లో రామ్ తన తరువాత సినిమాని చేయబోతున్నట్లు సమాచారం.. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉంది.
ఈ సినిమాతో పాటుగా మరొక చిత్రానికి రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. త్వరలో దీని గురించి కూడా ఓ క్లారిటీ రానుంది. వెకేషన్ పూర్తి చేసుకొని ఇటీవల హైదరాబాద్ వచ్చిన రామ్, కొంచెం టైమ్ తీసుకొని సినిమా మొదలు పెట్టనున్నాడు
The post కొత్త సినిమా మొదలు పెట్టబోతున్న రామ్! first appeared on Andhrawatch.com.