“గొర్రె పురాణం” విడుదల తేదీ ఎప్పుడంటే! | CineChitram

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న టాలెంటెడ్ నటుడు సుహస్. ఈ నటుడు ప్రసన్నవదనం చిత్రంలో చివరిసారిగా కనిపించి మెప్పించాడు. తదుపరి జనక అయితే గనక చిత్రం విడుదల కావాల్సి ఉంది. అయితే ఆ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు సుహస్ ప్రధాన పాత్రలో నటించిన మరొక సినిమా వార్తల్లో నిలిచింది.

 గొర్రె పురాణం చిత్రం ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ చిత్రం విడుదల తేదీ పై మేకర్స్ తాజాగా ఓ క్లారిటీ ఇచ్చారు.ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 20, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇదే విషయాన్ని వెల్లడించడానికి సరికొత్త పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. గొర్రె తో సుహస్ కనిపిస్తున్నాడు. చేతులకు సంకెళ్లు ఉండగా, పోలీసు వాహనం లో గొర్రె , సుహస్ లు ఉన్నారు. సినిమా ఎమోషనల్ కంటెంట్ తో నిండి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాబీ రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి  పవన్ సీ హెచ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

The post “గొర్రె పురాణం” విడుదల తేదీ ఎప్పుడంటే! first appeared on Andhrawatch.com.

About

Check Also

‘Aggipulle’ from Dilruba – A Captivating Melody That Touches the Soul | CineChitram

After the success of KA, Kiran Abbavaram is ready to win over the hearts of …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading