మోడలింగ్ రంగం నుంచి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బోర్సే. తొలి సినిమానే హిట్ అవ్వడంతో భాగ్యశ్రీకి కార్తీక్ ఆర్యన్ నటించిన ‘చందు ఛాంపియన్’లో నటించే అవకాశం వచ్చింది. ఇక ‘మిస్టర్ బచ్చన్’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి.. యువ హృదయాలను కొల్లగొట్టేశారు. భాగ్యశ్రీ డ్యాన్స్, హావభావాలకు అందరూ ఫిదా అయ్యారు.
మిస్టర్ బచ్చన్ అనుకున్న హిట్ అందుకోకపోయినా… భాగ్యశ్రీకి మాత్రం స్టార్ హీరో సినిమాలో నటించే లక్కీ ఛాన్స్ వచ్చింది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సినిమాలో భాగ్యశ్రీ నటించనున్నారని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి. చివరకు ఆ వార్తలే నిజం అయ్యాయి. దుల్కర్ సల్మాన్ హీరోగా, నీలా ఫేమ్ సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘కాంత’ చిత్రంలో భాగ్యశ్రీ నటిస్తున్నారు.
దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ఇటీవల ఈ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేయగా.. తాజాగా పూజా కార్యక్రమంతో ఈ సినిమా మొదలైంది. ఇందులో భాగ్యశ్రీ పాల్గొన్నారు. ఈ సినిమాలో రానా కూడా నటిస్తున్నారు. దానికి సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్ గా మారాయి. త్వరలోనే రెగ్యులర్ షూట్ మొదలు కానుంది. ఇందులో దుల్కర్ పాత్ర సరికొత్తగా ఉంటుందని టాక్. దుల్కర్ నటిస్తున్న ‘లక్కీ భాస్కర్’ చిత్రం ఈ దీపావళి పండుగ సందర్భంగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.
The post మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిన ముద్దుగుమ్మ! first appeared on Andhrawatch.com.