నేచురల్ స్టార్ నాని హీరోగా చేసిన సినిమాలో పలు క్లాస్ సినిమాలు కూడా ఉన్నాయి. అలాగే మాస్ చిత్రాలు కూడా ఉండనే ఉన్నాయి. అయితే తన కెరీర్ లో బిగ్గెస్ట్ మాస్ హిట్ “సరిపోదా శనివారం” అలాగే దీనికి ముందు చేసిన “దసరా” సినిమాలు అని చెప్పుకొవచ్చు. అయితే దసరా సినిమాని తెరకెక్కించిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఇప్పుడు నానితో మరో సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమా కోసం తాను పెట్టిన ఓ సాలిడ్ పోస్ట్ ఫ్యాన్స్ ని మరింత ఉత్సాహపరిచింది. 2023 మార్చ్ 7న నా మొదటి సినిమా “దసరా” మూవీకి చివరిగా చెప్పిన మాట “కట్ షాట్ ఓకే”. ఇప్పుడు మళ్ళీ 2024 సెప్టెంబర్ 18న నానితో రెండో సినిమా ప్రకటన వీడియోకి యాక్షన్ మాట చెప్పాను.
ఇది చెప్పడానికి నాకు 4 కోట్ల 84 లక్షల 400 సెకండ్ల సమయం పట్టింది. ఇప్పుడు నేను ప్రామిస్ చేస్తున్నాను ఈ సినిమా దసరా కి 100 రెట్లు మించి ఉండబోతుంది అంటూ సాలిడ్ పోస్ట్ ఒకటి చేశాడు. దీంతో ఈ సినిమా విషయంలో తాను ఎంత కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు అనేది మనం అర్ధం తెలుసుకోవచ్చు. మరి ఈ ఇద్దరి కలయికలో వచ్చే రెండో సినిమా ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
The post దసరాకి 100 రెట్లు ఎక్కువగా..! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
