ఇక నుంచి ఇవి మాత్రమే! | CineChitram

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా,  రష్మికా  హీరోయిన్ గా,  డైరెక్టర్‌ సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “పుష్ప 2 ది రూల్” గురించి  అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో ఆడియెన్స్ మరో సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది ఇదే అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.

అయితే సినిమా ఇప్పుడు శరవేగంగా షూటింగ్ ని పూర్తి చేసుకుంటుండగా ఈ సినిమా నుంచి నెక్స్ట్ వచ్చే అప్డేట్స్ పై అయితే ఒక ఊహించని టాక్‌ వినిపిస్తుంది.  పుష్ప 2 నుంచి ఇక నెక్స్ట్ ఎలాంటి టీజర్ రాబోయేది లేదని చిత్ర బృందం వెల్లడించింది. డైరెక్ట్ గా పాటలు అలాగే ట్రైలర్ మాత్రమే రాబోతోంది అని బన్నీ కాంపౌండ్ నుంచి ఓ క్లారిటీ అయితే వచ్చేసింది.

సో పుష్ప 2 నుంచి ఇక ఎలాంటి గ్లింప్స్ కానీ టీజర్ కానీ వచ్చేది లేదని చెప్పేసింది. ఇక ఈ భారీ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. అలాగే ఈ డిసెంబర్ 6న గ్రాండ్ గా సినిమా  విడుదలకి సిద్దంగా ఉంది.

The post ఇక నుంచి ఇవి మాత్రమే! first appeared on Andhrawatch.com.

About

Check Also

Ram Charan’s interesting comments on Game Changer | CineChitram

The global star Ram Charan has joined forces with the visionary director Shankar for a …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading