గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా మావెరిక్ దర్శకుడు శంకర్ కాంబోలో ఎంతో మంది ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమానే “గేమ్ ఛేంజర్”. ఈ సినిమా గురించి మెగా ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సాలిడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాతో శంకర్ మళ్ళీ తన మార్క్ హిట్ కొట్టాలని తన ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు.
అయితే ఈ సినిమా నుంచి ఇప్పుడు వరకు ఒక్క పాట మాత్రమే అభిమానుల ముందుకు వచ్చింది. అదే చరణ్, కియారా మధ్య డ్యూయెట్ సాంగ్ జరగండి అనే సాంగ్ ని విడుదల చేశారు. అయితే ఈ సాంగ్ అఫీషియల్ గా విడుదల చేయకముందు మరో వెర్షన్ మరో గాత్రధారుల వాయిస్ తో వచ్చాయి. ఆ సాంగ్ అందరికీ బాగా నచ్చింది.
కానీ తర్వాత సాంగ్ లో మరో వాయిస్ ఉండడంతో కొంచెం డిజప్పాయింట్ అయ్యారు. మరి ఈ పాట పై థమన్ సాలిడ్ అప్డేట్ అయితే అందించాడు. ఎడిటింగ్ రూమ్ నుంచి జరగండి సాంగ్ విజువల్స్ చూసాను అని సౌండ్, విజువల్స్ అదిరిపోయాయి. అలాగే ఫ్యాన్స్ కోరుకుంటున్నట్టుగా అప్పుడు లీక్ అయిన పాటలో వోకల్స్ ని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని మరో ఊహించని అప్డేట్ ని అందించాడు.
The post గేమ్ ఛేంజర్ గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన థమన్! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
