ఆదివారం రాత్రి జరగాల్సిన ‘దేవర సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్’.. రద్దీ, తొక్కిసలాట, భద్రతా కారణాల కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. రద్దు చేసినందుకు క్షమాపణలు చెబుతూ జూనియర్ ఎన్టీఆర్ – జాన్వీ కపూర్ తమ వీడియో సందేశాలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఏది ఏమైనా ‘దేవర ప్రీ-రిలీజ్ ఈవెంట్’ రద్దు అవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.
అయితే, మళ్లీ ఫ్యాన్స్ కోసం ఏదైనా వేడుకను దేవర టీమ్ నిర్వహిస్తుందా ? అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడున్న అప్ డేట్ ప్రకారం దేవర టీమ్.. సినిమా విడుదలకు ముందు ఇక ఎటువంటి కార్యక్రమాలను నిర్వహించే ఆలోచనలో లేదు. ‘కల్కి 2898 AD’ టీమ్ చేసినట్లే, సినిమా విడుదల తర్వాత ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ 27న గ్రాండ్ గా విడుదల అవుతోంది.
ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.
The post ప్చ్ …లేనట్టేనా? first appeared on Andhrawatch.com.