మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “విశ్వంభర” గురించి అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే దీనికి ముందు చిరు నుంచి వచ్చిన ప్లాప్స్ లో “ఆచార్య” గురించి కూడా ఈ మధ్య చర్చ నడిచింది.
అయితే ఈ సినిమా దర్శకుడు కొరటాల శివకి చిరంజీవికి మధ్యమ అప్పటి నుంచి చిన్నపాటి కోల్డ్ వార్ ఉందని ఆ సినిమా ఫలితం విషయంలో వారు చేసిన కామెంట్స్ కొన్ని వైరల్ అయ్యాయి. అయితే అసలు ఈ కోల్డ్ వార్ కి కొరటాల లేటెస్ట్ గా ఫుల్స్టాప్ పెట్టేశారు. దేవర ప్రమోషన్స్ లో చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.
తమ ఇద్దరికీ ఎలాంటి విభేదాలు లేవని మొట్టమొదటగా శివ నువ్ బౌన్స్ బ్యాక్ అవుతాయని మెసేజ్ చేసిందే ఆయన అని మా ఇద్దరి మధ్య బంధాన్ని ఇంటర్వ్యూ లో చాలా మంది తప్పుగా అర్ధం చేసుకున్నారు అంటూ కొరటాల శివ ఒక క్లారిటీ ఇచ్చారు. దీంతో గత కొన్నాళ్ల నుంచి ఉన్న అపోహలకు ఇపుడు క్లారిటీ వచ్చేసింది.
The post ఆ వివాదాలు ఏంటంటే! first appeared on Andhrawatch.com.