బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండేకి సక్సెస్ లేకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొంతకాలం క్రితం ఆమె ఓ వ్యక్తితో డేటింగ్ చేస్తోందని పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా, అనన్య పాండే లవ్ లైఫ్ గురించి మరో వార్త వైరల్ గా మారింది. స్టార్ క్రికెటర్ శుభమన్ గిల్ తో అనన్య పాండే డేటింగ్ చేస్తోందని కొత్తగా టాక్ వినిపిస్తోంది.
అనన్య పాండే, శుభ్‌మన్ గిల్ కలిసి కొంత కాలం క్రితం ఓ యాడ్ చేశారు. ఆ యాడ్ షూట్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని నెట్టింట ఓ వార్త తిరిగేస్తుంది. ఈ ప్రచారానికి సంబంధించి ఓ ఇంటర్వ్యూలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు అనన్య పాండే సరదాగా సమాధానం చెప్పుకొచ్చింది.
‘విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఒక యాడ్ షూట్ సమయంలోనే కలుసుకున్న వారు ప్రేమలో పడ్డారు. శుభ్ మన్ గిల్ – నేను అలాగే కలిశాం, కాబట్టి.. ప్రేమలో పడ్డాం అని కొందరు వార్తలు రాసేసుకుంటున్నారు. అందులో నిజం లేదు. బేసిక్ గా మేం చాలా డిఫరెంట్. నాకు, శుభ్‌మన్‌కు మధ్య ప్రస్తుతం మాటలు కూడా లేవు. ఇక రొమాన్స్ ఎలా ఉంటుంది ?’ అంటూ అనన్య పాండే అయితే ఓ క్లారిటీ ఇచ్చేసింది.
The post ఆ క్రికెటర్ తో ప్రేమాయణం…ఈ ముద్దుగుమ్మ ఏమంటుందంటే! first appeared on Andhrawatch.com.