తమిళ హీరో కార్తీ నటించిన ‘సత్యం సుందరం’ సెప్టెంబర్ 28న గ్రాండ్ గా థియేటర్లలోకి వచ్చిన సంగతి తెలిసిందే. సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమాలో హృదయానికి హత్తుకునే ఎమోషనల్ డ్రామా ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి బాగా కనెక్ట్ అవుతున్నారు. అయితే, సాధారణ ప్రేక్షకులతో పాటు కొందరు సినీ ప్రముఖులు కూడా ఈ సినిమా పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ‘సత్యం సుందరం’ సినిమా పై అక్కినేని నాగార్జున ప్రశంసలు జల్లు కురిపించారు.
‘సత్యం సుందరం’ సినిమాను చూసిన అక్కినేని నాగార్జున తాజాగా ఓ పోస్ట్ పెట్టారు. ‘ప్రియమైన కార్తీ.. నిన్న రాత్రే మీ సినిమా చూశాను. మీరు, అరవింద్ చాలా బాగా నటించారు. నేను సినిమా చూసినంత సేపు నవ్వుతూనే ఉన్నాను. ఎన్నో చిన్ననాటి జ్ఞాపకాలను, మన సినిమా ఊపిరి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాను. ప్రేక్షకులు, విమర్శకులు సైతం మీ సినిమాను అభినందిస్తున్నందుకు చాలా సంతోషం పడుతున్నాను. టీమ్ కు అభినందనలు’ అంటూ నాగ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
The post ఆ సినిమా పై నాగ్ ప్రశంసలు! first appeared on Andhrawatch.com.