‘గేమ్ ఛేంజర్’ నుండి వచ్చిన ‘రా మచ్చా మచ్చా’ సాంగ్ ప్రోమో రాకింగ్ బీట్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. దీంతో ఈ పాట రాసిన లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ తో నిర్మాత దిల్ రాజు కాసేపు సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా అనంత్ శ్రీరామ్ మచ్చా మచ్చా పాటకు కారణాన్ని , ఈ పాట వెనుక ఉన్న సందర్భాన్ని కూడా చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ… ‘రా మచ్చా మచ్చా’ పాటకు ఇచ్చిన ట్యూన్ లోనే మచ్చా మచ్చా ఉంది. చివరగా ఆ పదమే ఫైనల్ అయిపోయిందని అన్నారు. దానికి బదులు ఇస్తూ , అనంత్ శ్రీరామ్ మాట్లాడుతూ.. ‘ఈ పాట రాయడానికి ముందు దర్శకుడు శంకర్ గారు నాకు చెప్పింది ఏమిటంటే.. మన ఫ్రెండ్ గొప్పవాడైన తరువాత, చాలా కాలం తర్వాత కలిశాక, ఎంత మంచి ఫ్రెండ్ అయినా స్నేహితులు ఫ్రీగా మాట్లాడలేరు.
కొంచెం మొహమాట పడతారు. అమ్మో ఇప్పుడు చాలా పెద్దోడు అయిపోయాడు, మనం ఫ్రీగా మాట్లాడొచ్చా ?, లేదా ? అని అనుమాన పడతారు. కాబట్టి, నేను మీలో ఒకడినే. నేను నీ ఫ్రెండ్ నే అన్న కాన్సెప్ట్ మీద ఈ పాట రావాలి అని నాకు చెప్పారు. ఆ మాటలే ఈ పాట రాయడానికి మూలం’ అంటూ అనంత్ శ్రీరామ్ వివరించారు.
The post అసలు కథ ఇది అనమాట! first appeared on Andhrawatch.com.