ఓజీ ఇండస్ట్రీ హిట్‌ గ్యారెంటీ! | CineChitram

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న భారీ సినిమాల్లో  దర్శకుడు సుజీత్ తో చేస్తున్న క్రేజీ యాక్షన్ డ్రామా “ఓజి” సినిమా కూడా  ఒకటి. మరి చాలా కాలం తర్వాత పవన్ నుంచి వస్తున్న తన మార్క్ యాక్షన్ సినిమా ఇది కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.  ఇక ఈ సినిమా షూటింగ్ కొంచెం బ్యాలన్స్ ఉండగా పవన్ దీనిని త్వరలోనే మొదలు పెట్టనున్నారు.

ఇక ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ కొడుతుందని సినిమా సంగీత దర్శకుడు థమన్ ఫుల్‌ ధీమా గా ఉన్నారు. ఓజీ అప్డేట్స్ అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తాము. ఈ సినిమా కోసం సుజీత్ అదిరిపోయే ప్లానింగ్ లు చేస్తున్నాడు. కాస్తా ఓపిక పట్టండి త్వరలోనే మరిన్ని అప్డేట్స్ తో కలుద్దాం అని థమన్ గ్యారెంటీ అందించాడు. దీనితో పవన్ ఫ్యాన్స్ థమన్ కాన్ఫిడెన్స్ చూసి అభిమానులు కూడా మంచి ఎగ్జైటెడ్ గా కనిపిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.

The post ఓజీ ఇండస్ట్రీ హిట్‌ గ్యారెంటీ! first appeared on Andhrawatch.com.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …