‘కళ్యాణం కమనీయం’ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ ప్రియా భవానీ శంకర్. తన నటనతో మెప్పించే ఈ ముద్దుగుమ్మ తమిళంలో ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రియా భవానీ శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది.
ఇంతకీ ప్రియా భవానీ శంకర్ ఏం మాట్లాడింది అంటే.. ‘ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి గ్లామర్‌గా కనిపించడం నాకు నచ్చదు. అలాంటి బోల్డ్ రోల్స్ ని నేను ఎప్పటికీ అంగీకరించను. కెరీర్ పరంగా ఎప్పుడైనా వెనక్కి తిరిగి చూసుకుంటే ఏ విషయంలోనూ బాధపడకూడదని నేను నిర్ణయం తీసుకున్నాను’ అంటూ ప్రియా చెప్పుకొచ్చింది.
ప్రియా భవానీ శంకర్ ఇంకా మాట్లాడుతూ.. ‘అందుకే, నా శరీరాన్ని ఒక వస్తువుగా నేను అనుకోను. అందాలు చూపించి అవకాశాలు అందుకోవడం నాకు ఇష్టం ఉండదు అందుకే, సినిమాల ఎంపిక విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటా. అయితే, నెగెటివ్ రోల్ చేయడానికీ వెనుకాడను.
ఎందుకంటే అది నా వృత్తి. అలాగే, ఒక హీరోయిన్ గా ఫ్యాషన్ పేరుతో అందాలను మాత్రంనేను ప్రమోట్ చేయలేను’ అని ఆమె పలు కామెంట్లు చేసింది. ఈ క్రమంలో తన తదుపరి సినిమా ‘బ్లాక్’ ను ఉద్దేశించి ఆమె ఇలా మాట్లాడింది.
The post ఆ పాత్ర గురించి క్లారిటీ ఇచ్చిన ముద్దుగుమ్మ! first appeared on Andhrawatch.com.