నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తన కెరీర్ లో 109వ సినిమాని యువ దర్శకుడు బాబీ కొల్లి తో నిర్మిస్తున్నాడు. మరి భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా షూటింగ్ అయితే ప్లాన్ ప్రకారం జరిగిపోతుంది కానీ ఈ సినిమా అప్డేట్స్ విషయంలో అభిమానులు మాత్రం కొంచెం నిరాశ గానే ఉన్నారని చెప్పాలి.
సినిమా నుంచి అరకొర అప్డేట్స్ వస్తున్న మాట పక్కన పెడితే.. ఇది కాకుండా సినిమా టైటిల్ ఏంటి అనేది మాత్రం చిత్ర బృందం నుంచి ఇంకా రాలేదు. దీంతో బాలయ్య అభిమానుల్లో ఈ విషయం మరింత సస్పెన్స్ గా ఉంది. అయితే ఇది వరకే పలు సందర్భాల్లో విడుదల చేసే ప్లాన్ చేసినట్టు టాక్ వచ్చింది కానీ కుదరలేదు.
దీంతో అసలు ఈ సినిమా టైటిల్ ఎప్పుడు వస్తుంది అనేది ఫ్యాన్స్ లో మరింత సస్పెన్స్ గా మారింది. మరి ఈ దసరా కానుకగా ప్రకటించే ఛాన్స్ ఉందని కొన్ని మాటలు అయితే వినపడుతున్నాయి. మరి ఆరోజున సినిమా అప్డేట్ ఏమన్నా వస్తుందో లేదో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా నాగవంశీ, త్రివిక్రమ్ లు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.
The post సక్సెస్ వీడేది ఎప్పుడంటే! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
