లైన్లో రెండు సినిమాలు! | CineChitram

మెగా పవర్ స్టార్  రామ్‌ చరణ్‌ హీరోగా, శంకర్  డైరెక్షన్‌ లో వస్తున్న సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’. బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఇందులో  హీరోయిన్ గా నటిస్తుండగా తమిళ నటుడు SJ సూర్య విలన్ రోల్ లో అలరించబోతున్నాడు. అనేక వాయిదాల తర్వాత జనవరి 10 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది గేమ్ ఛేంజర్.

భారీ అంచనాలు మధ్య గ్రాండ్ గా విడుదల కాబోతుంది ఈ సినిమా.ప్రస్తుతం ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో స్పోర్ట్స్ బ్యాడ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. కాగా రామ్ చరణ్ తన తదుపరి రెండు సినిమాలను ఇప్పటికే  లాక్ చేసి పెట్టాడు. బుచ్చి బాబు సిసిమా ముగిసిన వెంటనే కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఈ సినిమాను RRR ను నిర్మించిన DVV దానయ్య నిర్మించబోతున్నాడు. ఈ సినిమా పూర్తి చేసాక తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నటించనున్నాడు. ఇటీవల లోకేష్ రామ్ చరణ్ కలిసి స్టోరీ వినిపించాడని, ఆ లైన్ నచ్చడంతో రామ్ చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. లోకేష్ రజనీతో చేస్తున్న కూలీ సినిమా పూర్తి చేసి ఖైదీ -2, లియో సిక్వెల్ ను పూర్తి చేసి రామ్ చరణ్ సినిమాను తెరకెక్కిస్తాడని టాక్.

అటు ప్రశాంత్ నీల్ కూడా తారక్ తో చేస్తున్న సినిమా అయ్యాక సలార్ -2 చేసాక రామ్ చరణ్ సినిమా తెరకెక్కిస్తాడు. బుచ్చి బాబు సినిమా కోసం లుక్ ని పూర్తిగా మార్చేసే పనిలో పడ్డాడు చరణ్‌.

The post లైన్లో రెండు సినిమాలు! first appeared on Andhrawatch.com.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …