గంటలో స్పెషల్‌ సాంగ్‌! | CineChitram

టాలీవుడ్ పవర్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ చాలా కాలం తర్వాత సినిమా షూటింగ్స్ కి హాజరు అవుతున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాల్లో దర్శకుడు జ్యోతి కృష్ణతో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా పీరియాడిక్ మూవీ “హరిహర వీరమల్లు” కూడా ఒకటి. మరి పవన్ కెరీర్ లో మొదటి పాన్ ఇండియా సినిమా ఇది కాగా దీనిపై మంచి అంచనాలు కూడా నెలకొన్నాయి.

ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రంపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఓ సందర్భానుసారం పవన్ గొంతులో పాడాల్సిన సాంగ్ ఉంటుందట. మరి ఈ సాంగ్ ని పవన్ కేవలం ఒక గంటలో కంప్లీట్ చేసేసినట్టుగా సమాచారం. పవన్ ప్రస్తుతం షూటింగ్ చేస్తున్న సెట్స్ లోనే రీ రికార్డింగ్ కోసం స్పెషల్ సెటప్ చేసి పవన్ తోనే ఒక గంటలో పూర్తి చేసేశారట. అలాగే ఆ సాంగ్ ఐడియా కూడా పవన్ దే అన్నట్టుగా తెలుస్తుంది. అంతే కాకుండా ఈ సాంగ్ అవుట్ పుట్ కూడా బాగానే వచ్చినట్టుగా సమాచారం. మొత్తానికి అయితే ఈ సినిమా కూడా ఫుల్ స్వింగ్ లో పూర్తవుతుందని సమాచారం.

The post గంటలో స్పెషల్‌ సాంగ్‌! first appeared on Andhrawatch.com.

About

Check Also

Vishwak Sen’s female look from Laila unveiled | CineChitram

Mass Ka Das Vishwak Sen has garnered a separate fan base in the youth and …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading