బర్త్‌ డే కి మరో ట్రీట్! | CineChitram

రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. కేవలం సెలబ్రిటీలు మాత్రమే కాదు అభిమానులు, ఇతర హీరోల అభిమానుల సైతం ఆయన మీద పుట్టినరోజు శుభాకాంక్షలు జల్లు కురిపిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా ప్రభాస్ సినిమాల అప్డేట్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. నిజానికి అధికారికంగా ప్రకటన రాకపోయినప్పటికీ  ప్రభాస్ అభిమానుల కోసం ఆఫ్ ది రికార్డ్ లీక్స్  మాత్రం బయటకు వస్తున్నాయి.

ముఖ్యంగా ప్రభాస్ హను రాఘవపూడి సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ అయితే అభిమానుల ముందుకు వచ్చింది. అది ఏమిటి అంటే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ గత నెల తమిళనాడులో చేసినట్లుగా సమాచారం. అక్టోబర్ 25వ తేదీ నుంచి ఒక స్పెషల్ షెడ్యూల్ కోసం ప్లాన్ చేస్తున్నారని సమాచారం. లింగంపల్లిలో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ షూటింగ్ ప్లాన్ చేశారని అంటున్నారు. ఇక ఈ షూటింగ్ కోసం ఇప్పటికే భారీ సెట్లను రెడీ చేస్తున్నారు.

ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రభాస్ కి సంబంధించి ఒక ఫోటో షూట్ కూడా ఇదే సెట్లో చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు సిద్ధమైంది. ఇక ఆగస్టు నెలలో ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమం చాలా ఘనంగా సెలబ్రిటీల సమక్షంలో జరిగిన విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమాకి ఫౌజి అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది, కానీ దాని మీద క్లారిటీ లేదు. అయితే 1940 బ్యాక్ డ్రాప్ లో సినిమా తెరకెక్కకబోతుందని తెలుస్తోంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించబోతున్న ఈ సినిమాకి సుదీప్ చటర్జీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నవీన్ ఎర్నేని, ఎలమంచిలి రవిశంకర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

The post బర్త్‌ డే కి మరో ట్రీట్! first appeared on Andhrawatch.com.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …