కిరణ్‌ అబ్బవరం కోసం చైతూ! | CineChitram

కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా కొత్త సినిమా ‘క’. తెలుగులో ఈ సినిమా అక్టోబర్ 31 థియేటర్స్ లో సందడి చేయబోతుంది. ఇంతకుముందు చెప్పినట్టే.. మేకర్స్ ఈ సాయంత్రం హైదరాబాద్‌లోని ది వెస్టిన్‌లో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమానికి అక్కినేని నాగ చైతన్య ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.

సాయంత్రం 6 గంటల నుంచి ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ ప్రారంభం కానుంది. అన్నట్టు ఈ సినిమా పై మంచి బజ్ క్రియేట్ అయ్యిన విషయం తెలిసిందే.  ‘క’ సినిమాలో కిరణ్ అబ్బవరం జోడిగా న నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా చేస్తున్నారు రు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకం మీద చింతా గోపాలకృష్ణ రెడ్డి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ మూవీ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. దర్శక ద్వయం సుజీత్, సందీప్ ఈ సినిమాకి డైరెక్షన్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి గ్యాప్ తర్వాత కిరణ్ అబ్బవరం ‘క’తో రాబోతున్నాడు. విజయం సాధిస్తాడో లేదో చూడాలి.

ReplyForwardAdd reaction

The post కిరణ్‌ అబ్బవరం కోసం చైతూ! first appeared on Andhrawatch.com.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …