పాన్ ఇండియా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా సినిమా ‘రాజా సాబ్’ వచ్చే వేసవి కానుకగా విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ సిద్దంగా ఉన్నారు. ఇక ఈ సినిమా తరువాత తన నెక్స్ట్ మూవీగా హను రాఘవపూడి డైరెక్షన్లో ‘ఫౌజీ’లో నటిస్తున్నాడు. ఈ సినిమాలతో పాటు మరో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో ‘స్పిరిట్’ అనే సినిమాను కూడా మొదలు పెట్టనున్నారు.
అయితే, స్పిరిట్ మూవీకి సంబంధించి అభిమానుల్లో, సోషల్ మీడియాలో రకరకాల వార్తలు తెరమీదకు వస్తున్నాయి. ఈ సినిమాలో కొరియన్ యాక్టర్ డాన్ లీ కూడా నటిస్తున్నాడనే వార్త గతకొద్ది రోజులగా తెగ చక్కర్లు కొడుతోంది. అయితే, దీనిపై త్వరలోనే క్లారిటీ ఇస్తానని డైరెక్టర్ సందీప్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఓ ఈవెంట్లో పాల్గొని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు.
ఇక స్పిరిట్ మూవీలో ప్రభాస్ ఓ పవర్ఫుల్ సిన్సియర్ కాప్‌గా నటించబోతున్నాడని సందీప్ రెడ్డి ఇప్పటికే ప్రకటించడంతో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
The post డాన్ లీ ఉన్నాడా..? first appeared on Andhrawatch.com.