అల్లరి నరేష్ నటిస్తున్న తాజా సినిమా ‘బచ్చల మల్లి’ ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేసింది. ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా మేకర్స్ తీర్చిదిద్దుతున్నారు. ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్ పూర్తి మాస్ రగడ్ లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి.
ఈ సినిమా నుండి తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ను మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకి సంబంధించిన రెండో సింగిల్‌గా ‘‘అదే నేను అసలు లేను..’’ అనే పాటను నవంబర్ 22న మధ్యాహ్నం 12.06 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. దీనికి సంబంధించి ఓ పోస్టర్ కూడా రివీల్ చేశారు.
ఈ పోస్టర్లో అల్లరి నరేష్‌తో పాటు హీరోయిన్ అమృత అయ్యర్ కూడా కనపడుతుంది. దీంతో ఇదొక రొమాంటిక్ మెలోడి సాంగ్‌గా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాను సుబ్బు మంగలదేవి డైరెక్ట్ చేస్తుండగా రాజేష్ దండ, బాలాజీ గుట్ట నిర్మిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 20న గ్రాండ్ థియేట్రికల్ విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.
The post బచ్చల మల్లి రెండో పాట ఎప్పుడంటే! first appeared on Andhrawatch.com.