కామెడీ హీరో నుంచి సీరియస్ రోల్స్ చేసే హీరోగా మారిన అల్లరి నరేష్ తాజాగా నటిస్తున్న మరో సీరియస్ సినిమా ‘బచ్చల మల్లి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది.ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో మొదలుపెట్టి మొదటిపాట, టీజర్ వరకు అన్ని ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండటంతో ఈ సినిమాపై మరింత బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో మొదలైంది.
అయితే, ఈ సినిమా నుండి రెండో సింగిల్ సాంగ్‌గా రొమాంటిక్ మెలోడి ‘అదే నేను అసలు లేను’ అనే సాంగ్‌ని నవంబర్ 22న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే తెలిపారు. కాగా, ఈ సాంగ్‌ని ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ చేతుల మీదుగా లాంచ్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ నెల 22న మధ్యాహ్నం 12.06 గంటలకు ఈ సాంగ్‌ని రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించగా ఎస్పీ చరణ్, రమ్య బెహరా ఈ పాటను పాడారు. ఇక విశాల్ చంద్రశేఖర్ ఈ పాటకు అద్భుతమైన సంగీతాన్ని అందించినట్లు మూవీ మేకర్స్ చెబుతున్నారు. సుబ్బు మంగాదేవి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని రాజేష్ దండ, బాలాజీ గుట్ట నిర్మిస్తున్నారు. డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం రెడీ అవుతుంది.
The post థమన్ చేతులు మీదుగా..! first appeared on Andhrawatch.com.