కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ అండ్ మల్టీ స్టారర్ చిత్రం “కూలీ” చిత్రం కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా కోలీవుడ్ నుంచి మొదటి 1000 కోట్ల సినిమా కావచ్చనే టాక్ విస్తృతంగా వినిపిస్తుండగా ఈ చిత్రంలో మన టాలీవుడ్ నుంచి కింగ్ నాగార్జున కూడా సాలిడ్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే.
మరి తాజాగా కూలీ సినిమాలో వర్క్ చేయడంపై అలాగే దర్శకుడు లోకేష్ కనగరాజ్ పై నాగార్జున పలు ఆసక్తికర కామెంట్లు చేసారు. లోకేష్ కనగరాజ్ ఒక జెన్ – జీ చెందిన వాడు కాదు కానీ జెన్ – జీ ఫిలిం మేకర్ అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
అలాగే తన స్క్రీన్ ప్లే అలాగే పాత్రలతో కొత్త తరహా ఫిల్మ్ మేకింగ్ ని తన నుంచి చూసాను అని అలాగే ఈ సినిమా చేస్తున్నంత సేపు చాలా ఎంజాయ్ చేస్తున్నాను అంటూ నాగ్ చెప్పుకొచ్చారు. దీంతో ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.
The post కూలీ” విషయంలో కింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
