హీరో నాగచైతన్య హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల పెళ్లి పీటలెక్కతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గానే వీరి నిశ్చితార్థం వేడుక కూడా జరిగింది. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో తనకు కాబోయే సతీమణి, నటి శోభితా ధూళిపాళ్ల పై చైతూ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. తన జీవితంలో ఏర్పడిన వెలితిని ఆమె పూర్తి చేస్తుంది అంటూ చైతూ చెప్పుకొచ్చాడు.
చైతూ, శోభితాతో తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. ‘మా వివాహం చాలా సింపుల్, సంప్రదాయబద్ధంగా జరగబోతుంది. ఈ వేడుకల్లో ఆర్భాటాలకు తావులేదు. ప్రస్తుతం ఉత్సాహంగా పనులు జరుగుతున్నాయి. గెస్ట్ లిస్ట్, పెళ్లికి సంబంధించిన ఇతర విషయాలను ఇద్దరం కలిసి సెలెక్ట్ చేస్తున్నాం. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ మా కుటుంబానికి ఎంతో ప్రత్యేకం. స్టూడియోలోని తాతగారి విగ్రహం ఎదురుగా మా పెళ్లి జరగబోతుంది. ఆయన ఆశీస్సులు మాపై ఎప్పుడూ ఉంటాయి. ఇక శోభితాతో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఆశగా ఎదురుచూస్తున్నా’ అంటూ చైతు చెప్పుకొచ్చాడు.
The post చైతూ క్రేజీ కామెంట్స్! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
