నందమూరి కుటుంబం నుంచి నందమూరి నటసింహం వారసుడిగా ఎంట్రీ ఇస్తున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో బాలయ్య బాబు కుమారుడు మోక్షజ్ఞ. నటసింహం బాలయ్య వారసుడిగా తాను ఇపుడు భారీ ఎంట్రీ కి రెడీ అవుతున్నాడు. అయితే ఇపుడు సాలిడ్ లుక్స్ తో అభిమానులకు మోక్షజ్ఞ కనుల పండుగ చేస్తున్నాడు. ఇదిలా ఉండగా తాను సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ వర్మతో భారీ సినిమా చేయనున్న విషయం అందరికీ తెలిసిందే.
ఈ సినిమా కోసమే తను రెడీ అవుతుండగా ఇపుడు ఈ సినిమాపై లేటెస్ట్ బజ్ ఒకటి ప్రేక్షకులకు వినపడుతుంది. ఈ సినిమా షూట్ ఈ డిసెంబర్ 5నుంచి మొదలు కానుండగా మోక్షజ్ఞ అదే రోజు నుంచి షూటింగ్ లో పాల్గొననున్నాడట. దీంతో ఎన్నో ఏళ్ళు నుంచి ఎదురు చూస్తున్న బాలయ్య అభిమానుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడబోతుంది అని చెప్పాలి.
ఆల్రెడీ ఈ సినిమా సూపర్ హీరో జానర్ లో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రెండో సినిమాగా అనౌన్స్ చేశారు. దీంతో మరిన్ని అంచనాలు ఈ సినిమాపై ఇప్పుడు ఏర్పడ్డాయి.
The post బరిలోకి అప్పుడేనా! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
