అయితే, ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వార్త వచ్చినా నెట్టింట వైరల్ గా మారుతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో సంగీత డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఓ స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేసినట్లు సమాచారం. కాగా ఈ స్పెషల్ సాంగ్ కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినపడుతుంది.
ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ ‘కియారా అద్వానీ’ ఈ స్పెషల్ సాంగ్ లో కనిపించనుందనే వార్త వినపడుతుంది. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో చూడాల్సిందే. ఈ చిత్రాన్ని టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ కాంబోలో భారీ స్థాయిలో నిర్మించబోతున్నట్లు సమాచారం.
‘స్పిరిట్’ మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. సందీప్ రెడ్డి వంగా నుంచి మరో వినూత్న సినిమా రాబోతుందని సమాచారం.
The post ప్రభాస్ స్పిరిట్ లో స్పెషల్ సాంగ్! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
