కోర్టుకెళ్లి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్న విష్ణు | CineChitram

మంచు విష్ణు తన తమ్ముడు మంచు మనోజ్ పై కోర్టుకెక్కాడు. తన మీద ఎలాంటి సోషల్ మీడియా పోస్టులు పెట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని సిటీ సివిల్ కోర్టులో విష్ణు పిటిషన్ వేశాడు. పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. విష్ణుపై ఎలాంటి పరువు తక్కువ ప్రకటనలు చేయకూడదని సివిల్ కోర్టు ఉత్తర్వులు విడుదల చేసింది.

సైలెంట్ గా కోర్టుకెళ్లి ఉత్తర్వులు తెచ్చేసుకుని దాన్ని తన పీర్ టీం ద్వారా మీడియాకు లీక్ చేసుకున్నారు. ఇంతకూ సోదరుడు మాత్రమే పరువు నష్టం పోస్టులు పెడతారా? . ఇటీవల తన ఇంటి జనరేటర్‌లో విష్ణు చక్కెర పోశాడని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కొన్ని వీడియోలను కూడా సోషల్ మీడియాలో పెట్టారు.

దీంతో మంచు విష్ణుపై సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ జరిగింది. మరోసారి ఇలాంటివి చేయకుండా ఆయన ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లుగా సమాచారం. మరో వైపు పంచదార ఇష్యూలో విష్ణు తప్పేమి లేదని వారి తల్లి నిర్మల పోలీసులకు కూడా లేఖ రాశారు. మంచు కుటుంబంలో ఇలాంటి వివాదాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.

మోహన్ బాబుకు అరెస్టు నుంచి కోర్టు రక్షణ కల్పించకపోవడంతో ఆయన ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వివాదాలు పెరిగిిపోతూండంతో మంచు వారి కుటుంబం సతమతమవుతోంది.

The post కోర్టుకెళ్లి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్న విష్ణు first appeared on Andhrawatch.com.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …