నా క్యారెక్టర్‌ ని దెబ్బతీయాలని చూస్తున్నారు! | CineChitram

సంథ్య థియేటర్ ఘటనపై సీఎం రేవంత్ అన్న మాటలకు  కౌంటర్ గా అల్లు అర్జన్ మీడియాతో మాట్లాడారు. ముందుగా రేవతి, శ్రీ తేజ్ కుటుంబానికి క్షమాపణలు చెప్పారు. ఆ కుటుంబానికి జరిగింది చాలా బాధకరమన్నారు. థియేటర్ కు వచ్చిన వారిని నవ్వుతూ పంపించాలని కోరుకునే మనిషిని నేను. థియేటర్ లో ప్రమాదం జరిగిందంటే నాకంటే బాధపడేవారు ఎవరు లేరు. శ్రీ తేజ్ కోలుకోవడం సంతోషించదగ్గ విషయమని బన్నీ అన్నారు.

మిస్ కమ్యూనికేషన్ వల్ల తప్పుడు ప్రచారం జరుగుతుందన్నారు. గవర్నమెంట్ మద్ధతుగా నిలిచినందుకు థాంక్స్. 20 ఏళ్లుగా నేను ఇలా చేశానా? నా గురించి మొత్తం తప్పుడు వార్తలు క్రియేట్ చేస్తున్నారు. నా క్యారెక్టర్ ను బ్యాడ్ గా క్రియేట్ చేస్తున్నారు. 30 ఏళ్లుగా సంథ్య థియేటర్ వెళ్తున్నాను. నేను పర్మిషన్ లేకుండా వెళ్లానని చెప్పడం బాధకరం.

అన్ని జాగ్రత్తలు, పర్మిషన్స్ తీసుకున్న తర్వాతే నేను థియేటర్ వెళ్లాను. రోడ్ షో చేయలేదు. థియేటర్ దగ్గర కారు ఆగిన వెంటనే జనం పరిగెత్తుకొచ్చారు. నెమ్మదిగా ముందుకు వెళ్లండని చెప్పాను. కానీ రెచ్చగొట్టలేదు. డిస్ట్రబ్ చేయాలని చేయలేదు. నన్ను పోలీసులు కలవలేదు. జనం ఎక్కువయ్యారు వెళ్లిపోవాలని మా టీమ్ చెప్పగానే వెళ్లిపోయా. నా పిల్లలు నా పక్కనే ఉన్నారు. అలాంటిది నా అభిమాని చనిపోయారని తెలిస్తే తట్టుకుంటానా.

ఇంటికి వెళ్లిపోయిన తర్వాతే తెలిసింది. రేవతి చనిపోయిందని తెల్లవారిన తరువాత మా టీమ్ తెలియజేసింది. అప్పటిదాకా తెలియదు. ఆ తరువాత  హాస్పిటల్ కి కూడా రావొద్దని చెప్పారు. అప్పటికే ప్రమాదం జరిగిపోయింది. మళ్లీ హాస్పిటల్  కి వెళితే లిగల్ గా ఇబ్బంది పడతారని టీమ్‌ తెలిపింది. దీంతో ఆగిపోయాను అని అన్నారు. ‘గతంలో పలువురి హీరోల అభిమానులు చనిపోతే పరామర్శించడానికి వెళ్లాను. నా సొంత అభిమానులు చనిపోతే, వెళ్లి కలవనా? జరిగిన ఘటన విషయం తెలిసి షాక్‌లో ఉన్నాను.

ఘటన జరిగిన తర్వాత ఏం చేయాలో తెలీక వీడియో పెట్టా. ఆ వీడియో కూడా డబ్బు కోసమని కాకుండా వాళ్ళ కోసం నేనున్నానని చెప్పడానికే.  ఇలా జరిగిన తర్వాత అన్ని ప్రోగ్రామ్స్ అన్ని క్యానిల్ చేసుకున్నాం. లీగల్ గా నేను వెళ్ళలేనని, బాబు పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు స్పెషల్ పర్మిషన్ తో మా నాన్నను హాస్పిటల్ కి పంపాను. ఆ తర్వాత సుకుమార్ ను పంపించా. అలాంటిది నేను అసలు కేర్ చేయడం లేదని, నాపై తప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు చాలా బాధగా ఉంటుంది.

మీరు థియేటర్‌కు వచ్చి ఎంజాయ్‌ చేయాలని నేను సినిమాలు చేస్తున్నా. గర్వపడేలా సినిమా  చేశానని అనుకుంటే, మనల్ని మనం కిందకు లాక్కుంటున్నాం..’ అంటూ చెప్పుకొచ్చాడు.

The post నా క్యారెక్టర్‌ ని దెబ్బతీయాలని చూస్తున్నారు! first appeared on Andhrawatch.com.

About

Check Also

Salaar 2 will Be one of My Best works : Neel | CineChitram

Exactly an year ago, KGF director Prashanth Neel and Baahubali actor Prabhas took the box …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading