ఇక సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న మహానటి! | CineChitram

కోలీవుడ్ బ్యూటీ కీర్తి సురేష్ ఇటీవలే పెళ్లి పీటలెక్కింది. తన చిన్ననాటి స్నేహితుడి అంటోని తట్టిల్ తో కలిసి కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. డిసెంబర్ 12 న వీరి పెళ్లి గోవాలో ఎంతో వేడుకగా జరిగింది. హిందూ, క్రిస్టియన్.. రెండు సాంప్రదాయాల్లో ఈ జంట పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ సినిమా షూటింగులకి బ్రేక్ ఇచ్చి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తోంది.

ఇప్పటివరకు కొత్త సినిమాలేవీ ఆమె కమిట్ కాలేదు. పెళ్ళికి ముందు సంతకం పెట్టిన బాలీవుడ్ మూవీ ‘బేబీ జాన్’ ను పూర్తి చేసి ఇటీవల ప్రమోషన్స్ లో కూడా పాల్గొంటుంది. ఇదిలా ఉంటే కీర్తి సురేష్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందని ఓ వార్త చక్కర్లు కొడుతుంది.పెళ్లి తర్వాత కీర్తి సురేష్ సినిమాలకి గుడ్ బై చెప్పి తన భర్తతో కలసి దుబాయ్ దేశంలో సెటిల్ కాబోతోందని పలు గుసగుసలు వినపడుతున్నాయి.

అయితే ఆంథోని కి దుబాయ్ లో పలు వ్యాపారాలు ఉన్న సంగతి తెలిసిందే. అలాగే తన భర్తతో కలసి బిజినెస్ పనుల్లో తోడుగా ఉండాలని భావిస్తూ ఈ నిర్ణయం తీసుకుందని కోలీవుడ్ మీడియా సర్కిల్స్ లో ప్రచారం నడుస్తుంది.ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే దీనిపై పూర్తి స్పష్టత వచ్చేంత వరకు వేచి చూడాలి. కాగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ‘బేబీ జాన్’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. వరుణ్ ధావన్ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

The post ఇక సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న మహానటి! first appeared on Andhrawatch.com.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …