బన్నీకోసం రంగంలోకి చిరంజీవి! | CineChitram

ప్రస్తుతం తెలంగాణ లో అల్లు అర్జున్‌ వర్సెస్‌ టీజీ సర్కార్‌ అన్నట్లు తయారైంది. సంధ్య థియేటర్‌ లో జరిగిన గొడవ తారాస్థాయికి చేరింది.రెండు రోజు క్రితం  అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పై ఆరోపణలు చేయడం ఒకెత్తు అయితే.. అందుకు కౌంటర్ గా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం మరో ఎత్తు. ప్రెస్ మీట్ లో పోలీసులు తనకు ఏమీ చెప్పలేదని అన్నారు. అదే బన్నీకి పెద్ద మైనస్‌ అయ్యింది.

 బన్నీ చెప్పింది అబద్దం అని, పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ విడుదల చేసి మరి చెప్పారు. దాంతో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ లా పెద్ద పెద్ద చర్చలు నడుస్తున్నాయి. ఈ వివాదంలో అల్లు అర్జున్ పైనే ఎక్కువ నెగిటివిటీ టాక్‌ నడుస్తుంది. దానికి తోడు నిన్న అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ళ దాడి జరిగింది.

ఓయూ జేఏసీ స్టూడెంట్స్ అంటూ కొందరు బన్నీ ఇంటి వద్దకు వెళ్లి అక్కడ బౌన్సర్ల తో గొడవ పెట్టుకున్నారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడప్పుడే సద్దుమణిగేలా కనపడడం లేదు. అయితే ఈ వివాదంలో అల్లు అర్జున్ ను గట్టెక్కించేందుకు మెగాస్టార్ రంగంలోకి దిగబోతున్నట్లు నడుస్తుంది.

బన్నీ ఇంటిపై దాడి జరిగిన తరువాత అల్లు అరవింద్ చిరంజీవితో మాట్లాడినట్లు తెలుస్తుంది. తన కొడుకును ఎలాగైనా ఈ వివాదం నుంచి బయటకు తీసుకువచ్చేలా చూడమని చిరును అడిగినట్లు సమాచారం. దీంతో చిరంజీవి ఇండస్ట్రీ పెద్దగా  రంగంలోకి దిగి తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి గొడవను సద్దుమణిగేలా చేయనున్నట్లు ఓ టాక్‌ వినపడుతుంది.

దీంతో పాటూ ఇక నుంచి సినిమాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వదని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పడం పెద్ద సినిమాలకు ఆటంకంగా మారనుంది. దీంతో బడా నిర్మాతలంతా ఈ విషయంలో చిరంజీవి కలగజేసుకోవాలని అడిగినట్లు తెలుస్తుంది.

The post బన్నీకోసం రంగంలోకి చిరంజీవి! first appeared on Andhrawatch.com.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …