హిట్‌ 3 సినిమా షూటింగ్‌ లో విషాదం! | CineChitram

హిట్‌ 3 సినిమా షూటింగ్‌లో విషాదం! నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా సినిమా ‘హిట్-3’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. దర్శకుడు శైలేష్ కొలను డైరెక్షన్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను ‘హిట్’ మూవీస్‌ ఫ్రాంచైజీ లో భాగంగా రూపొందిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియో గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఈ మూవీపై అదిరిపోయే అంచనాలు పెంచాయి. అయితే, ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కశ్మీర్‌లో జరుగుతోంది.

ఈ షెడ్యూల్‌లో సినిమాకు సంబంధించిన పలు కీలక సన్నివేశాలను షూట్‌ చేస్తున్నారు. కాగా హిట్-3 కశ్మీర్ షెడ్యూల్‌లో అనుకొని విషాద సంఘటన జరిగింది. ఈ సినిమాకు పనిచేస్తున్న ఓ యంగ్ సినిమాటోగ్రఫర్ గుండెపోటుతో మృతి చెందారు. కుమారి కృష్ణ అనే అసిస్టెంట్ సినిమాటోగ్రఫర్ సాను జాన్ వర్గీస్ వద్ద పనిచేస్తోంది. ఛాతిలో నొప్పి రావడంతో ఆమెను హుటాహుటిన శ్రీ నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అయితే, కొంతమేర కోలుకున్న ఆమెను జనరల్ వార్డులోకి మారుస్తున్న క్రమంలో ఆమెకు మరోసారి గుండెపోటు వచ్చిందని.. దీంతో ఆమె చనిపోయినట్లు తెలుస్తుంది. కేరళలోని ఆమె స్వగ్రామంలో అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. ఈ ఘటనతో హిట్-3 చిత్ర యూనిట్ విషాదం లో మునిగిపోయింది.

The post హిట్‌ 3 సినిమా షూటింగ్‌ లో విషాదం! first appeared on Andhrawatch.com.

About

Check Also

ప్రభాస్‌ ఈ లుక్‌ లోకేష్‌ కోసమేనా! | CineChitram

ప్రభాస్‌ ఈ లుక్‌ లోకేష్‌ కోసమేనా! పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఇపుడు చేతినిండా భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారు.మరి ఈ …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading