మొదలైంది…హమ్మయ్యా! ఇప్పుడు ఇండియన్ సినిమా అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అంటే అది గ్యారంటీగా సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి కాంబోలో చేస్తున్న సెన్సేషనల్ మూవీ అనే చెప్పాలి.
మహేష్ కెరీర్ లో 29వ సినిమాగా మహేష్, రాజమౌళి కాంబోలో మొదటి సినిమాగా ఇది రూపుదిద్దుకుంటుంది. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో మేకర్స్ నేడు సైలెంట్ గా ముహూర్త కార్యక్రమాలు పూర్తి చేశారు. హైదరాబాద్ లోనే అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రం ప్రధాన బృందం మాత్రమే ఈ ముహూర్త కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అయితే ఎలాంటి ఫోటో లేదా వీడియో ఫుటేజ్ ని చిత్ర యూనిట్ అధికారికంగా బయటకు విడుదల చేయలేదు. కానీ సినిమా అయితే నేడే ఆరంభం అయ్యింది. మరి అధికారికంగా ప్రకటన కోసం అభిమానులు ఇపుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్స్ ట్రెండింగ్ చేస్తూ ఓ రేంజ్ లో హైప్ ఇస్తున్నారు.
The post మొదలైంది…హమ్మయ్యా! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
