మహేష్, ప్రభాస్.. వీరిలో చరణ్ తో నటించేదేవరు.. | CineChitram

మహేష్, ప్రభాస్.. వీరిలో చరణ్ తో నటించేదేవరు..? ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర పలు భారీ మల్టీస్టారర్ సినిమాల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. మరి వీటిలో RRR కూడా ఒకటి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లతో వచ్చిన ఈ సినిమా తర్వాత మరిన్ని క్రేజీ మల్టీస్టారర్ సినిమాలు ఇపుడు రాబోతున్నాయి.

అయితే తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆసక్తికర సమాధానాన్ని బాలయ్య టాక్ షో అన్ స్టాప్పబుల్ సీజన్లో చెప్పినట్టుగా తెలిసిందే. మరి బాలయ్య అడిగిన ప్రశ్న సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఇద్దరిలో ఎవరితో మల్టీస్టారర్ చేస్తావు అని అడిగితే తాను మహేష్ తో చేసేందుకు రెడీ అని సమాధానం చెప్పాడంట. దీంతో ఒకవేళ పరిస్థితులు కలిసి వస్తే కచ్చితం గా ఈ మెగా సూపర్ మల్టీస్టారర్ సాధ్యపడుతుంది అని చెప్పుకోవచ్చు.

అయితే ఇవి మాత్రమే కాకుండా ఎన్నో క్రేజీ ప్రశ్నలకి చరణ్ సమాధానం ఇవ్వగా ఈ ఎపిసోడ్ రేపు జనవరి 8న స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.

The post మహేష్, ప్రభాస్.. వీరిలో చరణ్ తో నటించేదేవరు.. first appeared on Andhrawatch.com.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …